Mahesh Babu : మహేశ్‌ బాబు మైండ్ బ్లాకింగ్ పోస్టర్..జక్కన్న బర్త్‌డే గిఫ్ట్‌తో బాక్సాఫీస్ షేక్..

Mahesh Babu :మహేశ్ బాబు బర్త్‌డే వేడుకల సందర్భంగా రుద్ర క్యారెక్టర్‌ను ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తూ జక్కన్న సోషల్ మీడియాలో ఒక క్రేజీ క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టారు.

Mahesh Babu

ఇండియన్ మూవీ హిస్టరీలో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్‌గా సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కొత్త సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈరోజు ప్రిన్స్ మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో మహేశ్ బాబు(Mahesh Babu) లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాలు ఫిదా అయిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా మహేశ్ బాబు పక్కన యాక్ట్ చేస్తున్న ఈ వరల్డ్ క్లాస్ అడ్వెంచర్ మూవీ నుంచి వచ్చిన బర్త్‌డే ట్రీట్.. అసలు సిసలైన ఫ్యాన్ స్టఫ్ అనే చెప్పొచ్చు.

మహేశ్ బాబు రుద్ర అండ్ శ్రీరాముడుగా డ్యూయల్ రోల్ చేస్తుండటంతో ఈ మూవీపై ఉన్న హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లింది. బర్త్‌డే వేడుకల సందర్భంగా రుద్ర క్యారెక్టర్‌ను ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తూ జక్కన్న సోషల్ మీడియాలో ఒక క్రేజీ క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టారు.

రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు అని రాజమౌళి తనదైన స్టైల్‌లో ఇచ్చిన లైన్ ఇప్పుడు సినిమా లవర్స్ మైండ్‌లో రౌండ్లు కొడుతుంది. జనరల్‌గా రుద్ర పేరు గుర్తుకు రాగానే విపరీతమైన కోపం, అగ్నిలాంటి వీరత్వం మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈ పోస్టర్ చూస్తే కోపంతో పాటు ఒక రకమైన కూల్‌నెస్, లోతైన ఆలోచనలు, భిన్నమైన షేడ్స్ ఉన్నట్లు అర్థమవుతోంది.

Mahesh Babu

ఇక పోస్టర్‌లో మహేశ్ బాబు(Mahesh Babu) ఒత్తైన హెయిర్, గడ్డం, మీసాలతో ఫుల్ మాస్ అండ్ రగ్గడ్ అడ్వెంచరర్ లుక్‌లో కనిపించి మరోసారి అందం కానీ తింటున్నాడా ఏంటి ఈ వయసులో కూడా ఏమున్నాడురా అనేలా కనిపిస్తున్నాడు. ముందెప్పుడూ లేని విధంగా మహేశ్ బాబును ఇలాంటి స్టైల్‌లో చూపించిన రాజమౌళి.. మరోసారి తన విజన్‌తో మరోసారి అందరినీ మ్యాజిక్ చేశారు.

పాన్ ఇండియా రేంజ్‌ను మించి ఇంటర్నేషనల్ ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ గ్రాండ్ విజువల్ వండర్.. 2027 ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి రెడీ అవుతోంది.

Self-Acceptance : లోకం మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన పనిలేదు..మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటే చాలు..

Exit mobile version