Just LifestyleLatest News

Self-Acceptance : లోకం మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన పనిలేదు..మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటే చాలు..

Self-Acceptance : మీ మైండ్ పీస్ ఇతరుల చేతిలో పెట్టకూడదు. అందుకే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. అంటే మీలోని ప్రతిభను మాత్రమే కాదు, మీకున్న లోపాలను, బలహీనతలను కూడా ప్రశాంతంగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి.

Self-Acceptance

లేచింది మొదలు పడుకునే వరకు.. నేను అందరికీ ఎలా కనిపిస్తున్నాను? నా డ్రెస్ అందరికీ నచ్చుతుందా? నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారు? నా ఇమేజ్ బయటవారి దగ్గర ఎలా ఉంది? నేను పోస్ట్ చేసిన ఫోటోకు ఎన్ని లైక్‌లు వచ్చాయి ఇలా పక్కవారి గురించి ఆలోచించడంతోనే చాలామంది జీవితాలు గడిచిపోతున్నాయి.

ఇలా ఎదుటివారు మనల్ని యాక్సెప్ట్ చేయాలని తాపత్రయపడటం మెల్లగా అందరికీ ఒక సైకలాజికల్ డిజార్డర్‌గా మారిపోతుందని మానసిక నిపుణులు అంటున్నారు. కానీ ప్రతీ ఒక్కరినీ మెప్పించడం ఎవరి వల్ల కాదు. బయటి ప్రపంచం మిమ్మల్ని ఒప్పుకోవడం వల్ల వచ్చే ఆనందం కేవలం ఆ పది నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ అదే మీరు మిమ్మల్ని ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ (Self-Acceptance) చేసుకున్నప్పుడు దొరికే జోష్, ప్రశాంతత వేరే లెవెల్‌లో ఉంటాయి.

మనం వేసుకునే డ్రస్ నుంచి నడిపే బైక్ వరకు ప్రతీదీ పక్కోడి కాంప్లిమెంట్ కోసమే ఆలోచించి చేస్తే, మన జీవితం అనే రిమోట్ కంట్రోల్‌ను ఎదుటివారి చేతిలో పెట్టినట్లే అవుతుంది. లోకం మిమ్మల్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతుంది. .అదే లోకం మీలో చిన్న తేడా వచ్చినా విమర్శిస్తూ పాతాళానికి తొక్కుతుంది.

అందుకే మీ మైండ్ పీస్ ఇతరుల చేతిలో పెట్టకూడదు. అందుకే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. అంటే మీలోని ప్రతిభను మాత్రమే కాదు, మీకున్న లోపాలను, బలహీనతలను కూడా ప్రశాంతంగా స్వీకరించడం. నా బాడీ కలర్ ఇది, నా హైట్ ఇది, నా కెపాసిటీ ఇది అని ఎటువంటి ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్స్‌కు లోను కాకుండా మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్న రోజు.. పక్కోడు మీ గురించి చేసే కామెంట్స్ అస్సలు మీకు లెక్కలోకే రావు.

Self-Acceptance
Self-Acceptance

ఎప్పుడైతే మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం అలవాటు చేసుకుంటామో.. అప్పుడే సొసైటీ నుంచి ఆమోదం కోసం వాళ్ల దగ్గరకు వెళ్తాం. ఇదే మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ను దారుణంగా దెబ్బతీస్తుంది.

ముందుగా ఎదుటివారితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం ఆపేయాలి. ఈ ప్రపంచంలో మీ లాంటి వ్యక్తి ఇంకొకరు లేరు, యూ ఆర్ యూనిక్ అని పదేపదే అనుకోవాలి. మీ తప్పుల నుంచి లెసన్ నేర్చుకోవాలి కానీ, ఆ తప్పుల వల్ల మిమ్మల్ని మీరు జీవితాంతం తక్కువ చేసుకోవడం, గిల్టీగా ఫీలవడం మానేయాలి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవడం మొదలుపెడితే ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తోందనే దానితో మీకు సంబంధమే ఉండదు.

Ghee : నెయ్యి తింటే లావవుతారా? లేక హెల్త్‌కు బూస్ట్ అవుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

Related Articles

Back to top button