Mega 158
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్ ..మెగా 158(Mega 158)పై టాలీవుడ్‌లో అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది.
ఫస్ట్ షెడ్యూల్ పొల్లాచిలో పూర్తి చేసుకుని ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. కాగా ఈ సమయంలో ఈ మూవీకి పాటలు అందిస్తున్న గేయరచయిత అనంత శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అనంత శ్రీరామ్ ఇచ్చిన క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. డైరెక్టర్ బాబి మేకింగ్ స్టైల్‌ను ప్రశంసిస్తూనే.. ఈ మూవీ స్టోరీ లైన్ ఎక్కువ భాగం గోదావరి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని చెప్పుకొచ్చారు.
పాతకాలపు పల్లెటూరి కథలా కాకుండా.. యూ తరం యూత్‌ను, మెయిన్‌గా జెన్-జీ (Gen-Z) ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకునేలా సరికొత్త ట్రెండీ ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ బాబీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అనంత శ్రీరామ్ చెప్పారు. ఈ మూవీ కోసం తాను ఇప్పటికే ఒక మంచి సాంగ్‌ను రాశానని, ఆ సాంగ్ థియేటర్లలో యూత్‌కు పూనకాలు తెప్పించడం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు.
ఇదే ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ మూవీ పెద్దిలోని ఒక మాస్ సాంగ్‌పై వస్తున్న నెగెటివ్ ట్రోలింగ్‌పై అనంత శ్రీరామ్ రియాక్టయ్యారు. ఒక పాటను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో చూస్తూ, ఆ మాస్ బీట్‌లోని జోష్‌ను ఎంజాయ్ చేయడం చేతకాని వారే అసలైన ఐటెం గాళ్లు అంటూ ఓ రేంజ్‌లో మండిపడ్డారు.
మొత్తానికి మెగా 158(Mega 158) గురించి అనంత శ్రీరామ్ చెప్పిన విషయాలు..చిరు మూవీపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లగా.. ట్రోలర్స్‌కు ఇచ్చిన కౌంటర్‌పై ఎలాంటి రీ కౌంటర్‌లు వస్తాయో చూడాలి.
Numerology : లీడర్‌షిప్ క్వాలిటీస్, అంతులేని ధైర్యం..నెంబర్ 9 స్పెషాలిటీలు ఇంకా చాలా ..
