Megastar Chiranjeevi
హీరోయిన్ సమంత మెయిన్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం ఇటీవల జూన్ 19న ఆడియన్స్ ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్ టైమ్ నుంచే సమంత పర్సనల్ లైఫ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
దీనిలో ముఖ్యంగా సామ్ ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తలపై అటు సమంత గానీ, ఇటు ఆమె భర్త రాజ్ గానీ ఇప్పటివరకు రియాక్టవలేదు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi )చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మూవీ టీంను తన ఇంటికి ఆహ్వానించిన మెగాస్టార్.. సమంత దంపతులకు,అలాగే టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్ట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సమంత, రాజ్ దంపతులకు కొత్త బట్టలతో పాటు స్పెషల్ గిఫ్ట్‌లను అందించి, వారితో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న చిరంజీవి, మూవీపై ప్రశంసలు కురిపిస్తూనే సామ్ , రాజ్ దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని, కొత్త జీవితాన్ని మొదలుపెట్టినందుకు వారికి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నట్లు మెగాస్టార్ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.
కాగా ఈ మూవీ గురించి చిరు మాట్లాడుతూ.. మా ఇంటి బంగారం తనకు చాలా ఆసక్తికరంగా అనిపించిందని కితాబిచ్చారు. ఉమ్మడి కుటుంబ బ్యాక్ డ్రాప్‌తో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా డైరెక్టర్ నందిని రెడ్డి తనదైన శైలిలో ఈ మూవీని తెరకెక్కించారని ప్రశంసించారు.
మెయిన్‌గా సమంత నటన, చీరకట్టులో ఆమె చేసిన యాక్షన్ సీన్స్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయని, ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో అవసరమని అన్నారు.
ఈ విజయానికి కారణమైన సమంత, నందిని రెడ్డి, రాజ్ ,మొత్తం మూవీ టీంకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూనే, తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సామ్ అండ్ రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలని చిరంజీవి(Megastar Chiranjeevi )ట్వీట్ చేశారు. దీంతో చిరు చెప్పిన కొత్త అధ్యాయం అంటే వారింట త్వరలోనే బేబీ సామ్ రాబోతున్నారా అంటూ నెటిజన్లు కొత్త అర్ధాలు తీస్తున్నారు.
మరోవైపు సమంత పర్సనల్ లైఫ్ గతంలో అనేక చర్చలకు దారితీసింది. చైతూతో వివాహ బంధం ముగిసిన తర్వాత ఆమె మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మయోసైటిస్ అనే అరుదైన ఆరోగ్య సమస్య బారిన పడినప్పుడు ఆమె చూపించిన ధైర్యం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.
“మా ఇంటి బంగారం“ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. @Samanthaprabhu2 నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.… pic.twitter.com/eE5xemjh3c
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 23, 2026
ఆ కష్టకాలం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత, ఆమె తన జీవితంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ డైరెక్టర్, టెక్నీషియన్ రాజ్ ప్రతాప్‌ను పెళ్లి చేసుకుని రెండోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.
ఇక సామ్ సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. ఒకప్పుడు కమర్షియల్ మూవీలలో కనిపించిన సమంత.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం పూర్తిగా రూటు మార్చేశారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో రాజి రోల్‌తో డిజిటల్ రంగంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సామ్ ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.
Thank you, Megastar @KChiruTweets Garu ❤️
Your appreciation for #MaaIntiBangaaram means the world to me and my team. It still feels surreal to receive such kind words from you.
So happy that you loved the film ✨ https://t.co/5c58VufEos
— Samantha (@Samanthaprabhu2) June 23, 2026
ఏది ఏమయినా పర్సనల్ లైఫ్‌లోని చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టేసి, ఇప్పుడు రాజ్‌తో కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తూ.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో డిఫరెంట్ పాత్రలతో దూసుకుపోతున్న సమంత జర్నీ నిజంగా అభినందనీయమే.
Zaynich : ప్రపంచాన్నే కాపాడుతున్న మన మెడిసిన్.. ఏంటీ మేడ్ ఇన్ ఇండియా బ్రహ్మాస్త్రం?
