Mohanlal : మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు..హైకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ

Mohanlal : 2011లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మోహన్ లాల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అప్పుడు 4 ఏనుగు దంతాలు, 13 ఐవరీ విగ్రహాలు దొరికాయి. వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం అనుమతి లేకుండా ఏనుగు దంతాలను కలిగి ఉండకూడదు.

Mohanlal

ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసులో హైకోర్టు విచారణ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఆయనపై దాదాపు 15 ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. అసలు కేసు వివరాల్లోకి వెళితే 2011లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మోహన్ లాల్(Mohanlal) నివాసంలో సోదాలు నిర్వహించారు.

అప్పుడు 4 ఏనుగు దంతాలు, 13 ఐవరీ విగ్రహాలు దొరికాయి. వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం అనుమతి లేకుండా ఏనుగు దంతాలను కలిగి ఉండకూడదు. దీంతో కేరళ అటవీ శాఖ మోహన్‌లాల్ పై కేసు నమోదు చేసింది.దీనిపై అప్పటి నుంచి విచారణ, వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే ఇటీవల మోహన్‌లాల్ తరపు న్యాయవాదులు కొన్ని కీలక వివరాలు సమర్పించారు.

మోహన్‌లాల్(Mohanlal) నిబంధనలు ఉల్లంఘించలేదని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్నెస్టీ పథకం కింద ఆస్తులను ముందే డిక్లేర్ చేశారని కోర్టుకు తెలిపారు. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిప్పుడే ఈ వివరాలు వారికి ఇచ్చారని వెల్లడించారు. కానీ అటవీశాఖ నుంచి సరైన సమయంలోనే అనుమతులు పొందారా అన్న దానిపై విచారణ జరుగుతోంది. వీటికి సంబంధించి లీగల్ అనుమతుల ధృవీకరణ పత్రాలు అవి కలిగి ఉన్నప్పుడే తీసుకున్నారా అనేదానిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ప్రజల వద్ద చట్టవిరుద్ధంగా ఉన్న వన్యప్రాణి అవశేషాలను ప్రభుత్వానికి డిక్లేర్ చేసేందుకు కేరళ అటవీశాఖ వన్-టైమ్ అమ్నెస్టీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎవరైతే తమ వద్ద ఉన్న దంతాలు లేదా ఇతర వన్యప్రాణి వస్తువులను వెల్లడిస్తారో, వారికి ఎటువంటి క్రిమినల్ ప్రాసిక్యూషన్ లేకుండా చట్టపరమైన మినహాయింపు లభిస్తుంది.

Mohanlal

సరైన పత్రాలు లేకుండా అక్రమంగా ఉన్నట్లు గుర్తించిన వాటికి, ఈ స్కీమ్ ద్వారా యాజమాన్య పత్రాలను పొందే అవకాశం ఉంటుంది. దీంతో మోహన్‌లాల్ అటవీశాఖ నుంచి యాజమాన్య పత్రాలు పొందారు. కానీ గెజిట్ నోటిఫికేషన్‌లో లోపాలు ఉన్నాయంటూ 2025 అక్టోబర్‌లో కేరళ హైకోర్టు ఆ పత్రాలను కొట్టివేసింది.

కొత్త నోటిఫికేషన్ ద్వారా ప్రజలందరికీ అవకాశం ఇవ్వవచ్చని సూచించింది. కోర్టు ఆదేశాలతో కేరళ ప్రభుత్వం ఈ ప్రత్యేక క్షమాభిక్ష పథకాన్ని తీసుకువచ్చింది. అనంతరం మోహన్‌లాల్ తన వద్ద ఉన్న 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలను ఈ పథకం కింద డిక్లేర్ చేశారు. ఇప్పుడు అదే కేసులో హైకోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వబోతోంది. సరైన సమయంలో అనుమతి పత్రాలు పొందితే మోహన్‌లాల్ ఈ కేసు నుంచి బయటపడతారు.

Garlic : మీ ఆరోగ్యం పదిలంగా ఉండాలా? అయితే మీ ఆహారంలో ఈ ఒక్క పదార్థం ఉంటే చాలు..

Exit mobile version