Garlic : మీ ఆరోగ్యం పదిలంగా ఉండాలా? అయితే మీ ఆహారంలో ఈ ఒక్క పదార్థం ఉంటే చాలు..

Garlic : వెల్లుల్లి కేవలం నోటికి రుచిని ఇవ్వడమే కాదు, అంతకు మించిన అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

Garlic

మన అమ్మమ్మల కాలం నాటి వంటింటి చిట్కాల నుంచి ఈ తరం డైట్ ప్లాన్స్ వరకు అన్నింటిలో కూడా తప్పనిసరిగా కనిపించే పేరు వెల్లుల్లిదే. ఏ కూరలోనైనా, పచ్చడిలో అయినా వెల్లుల్లి పడితే ఆ రుచే వేరు, ఆ సువాసనే వేరు అంటారు .

అయితే వెల్లుల్లి(Garlic) కేవలం నోటికి రుచిని ఇవ్వడమే కాదు, అంతకు మించిన అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే అటు ప్రాచీన ఆయుర్వేదంలోనూ, ఇటు ఆధునిక హెల్త్ డైట్‌లో కూడా వెల్లుల్లి ఒక సూపర్ ఫుడ్‌గా సెటిల్ అయిపోయింది.

వెల్లుల్లి(Garlic)లో ఉండే అల్లిసిన్ అనే ప్రత్యేక మూలకం మన బాడీకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీంతో పాటు విటమిన్ సి, బి6, మాంగనీస్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వెల్లుల్లిలో పుష్కలంగా దొరుకుతాయి.

ఇవన్నీ కలిసి బాడీలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచడానికి ఉపయోగపడతాయి. దీని వల్ల వాతావరణంలో వచ్చే మార్పులతో దాడి చేసే రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్‌ల బారిన పడకుండా మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

ఇక గుండె ఆరోగ్యం విషయంలో వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదంటారు ఆరోగ్య నిపుణులు.బ్లడ్ను శుద్ధి చేయడంలో, రక్త ప్రసరణను సాఫీగా మార్చడంలో వెల్లుల్లి కీలకంగా మారుతుంది. బాడీలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంతో పాటు, బీపీని కంట్రోల్‌లో ఉంచడానికి గార్లిక్ బాగా ఉపయోగపడుతుంది .

దీనివల్లే ఫ్యూచర్‌లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని కొన్ని పరిశోధనలు కూడా ప్రూవ్ చేశాయి. ఇవే కాకుండా తిన్న ఆహారం త్వరగా డైజెస్ట్ అవడానికి, మెటబాలిజాన్ని పెంచి వెయిట్ తగ్గడానికి అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండటానికి కూడా వెల్లుల్లి సాయపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

Garlic

అయితే చాలా లాభాలు ఉన్నాయి కదా అని వెల్లుల్లిని ఎలా పడితే అలా తీసుకోకూడదు. రోజూ ఉదయాన్నే ఒకటో రెండో పచ్చి రెబ్బలు నమలితే సరిపోతుంది. అది వీలుకానప్పుడు వంటల్లో తక్కువ మోతాదులో మాత్రమే వాడటం వల్ల పూర్తి ప్రయోజనాలు అందుతాయి.

కొందరికి వెల్లుల్లి పడకపోతే కడుపులో మంట లేదా గ్యాస్ వంటి ఇబ్బందులు రావొచ్చు. ముఖ్యంగా రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్న వారు లేదా ఇతర హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉన్నవారు వెల్లుల్లిని తమ డైలీ డైట్‌లో చేర్చుకునే ముందు డాక్టర్‌ని సంప్రదించి మాత్రమే తీసుకోవాలి.

Silence : మీ మౌనాన్ని వాళ్లు ఎలా తీసుకుంటున్నారు?..మీ బంధంలో ప్రేమ ఉన్నట్లా? లేనట్లా?

Exit mobile version