NBK 112
నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ NBK 112 ఏపీ రాజధాని అమరావతిలో పూజా కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. వెంకటపాలెంలో ఉన్న బిట్స్ పిలానీ గ్రౌండ్‌లో ఈ మూవీ లగ్నపత్రిక పూజ అట్టహాసంగా ముగిసింది.
ఈ మూవీ లాంఛింగ్ వేడుకకు మంత్రి నారా లోకేష్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి వేదికగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న మొదటి భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం.
ఈ ఈవెంట్‌లో సినిమా ముహూర్తపు సీన్‌కు మంత్రి నారా లోకేష్ స్వయంగా క్లాప్ కొట్టారు. బాలయ్య తనదైన స్టైల్‌లో పవర్‌ఫుల్ మాస్ డైలాగ్ చెప్పగా, అల్లుడు లోకేష్ క్లాప్ ఇవ్వడం అక్కడికి వచ్చిన నందమూరి ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది.
ఇక ఈ మొదటి షాట్‌కు బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని.. క్లాప్‌బోర్డ్ పట్టుకుని డైరెక్షన్ చేయడం అక్కడివారిని ఆకట్టుకుంది. అలాగేమంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, నిర్మాత సాహు గారపాటి వంటి కొంతమంది సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు.
కాగా తాను సాధారణంగా మూవీల ఓపెనింగ్ కార్యక్రమాలకు ఎప్పుడూ రాలేదని, కానీ తన ముద్దుల మావయ్య బాలకృష్ణ కోసం ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని లోకేష్ చెప్పారు. ఇంత పెద్ద బ్యానర్, ఒక భారీ నటుడితో మూవీ షూటింగ్ అమరావతిలోనే ప్రారంభం కావడం గర్వకారణమన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు లోకేష్, దుర్గేష్‌కు బాలకృష్ణ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు . ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానుభావులు పుట్టిన ఈ పవిత్ర నేలపై చిత్ర రంగాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. ఏపీలో ఒక పెద్ద చిత్రానికి క్లాప్ కొట్టి సుమారు 20 ఏళ్లు అవుతోందని, అమరావతిని సినీ హబ్‌గా మార్చడానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు.
ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లపై ప్రొడ్యూసర్లు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీని దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ మూవీకి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి మూవీ యూనిట్ రెడీ అవుతోంది.
🔥 బాలయ్య బాబు – కొరటాల శివ కాంబోకి శ్రీకారం! 🔥
— Premalatha_M (@MPremalatha4u) June 25, 2026
అమరావతిలో ఘనంగా ప్రారంభమైన #NBK112.
నటసింహం బాలకృష్ణ పవర్‌కు, కొరటాల శివ విజన్ జతకావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 🎬✨#NBK112 #NandamuriBalakrishna #KoratalaSiva #BalayyaBabu #Tollywood #Amaravati #TeluguCinema… pic.twitter.com/BaxsclwCEQ
Horse Shoe : మీ ఇంటికి నల్ల గుర్రపు నాడా తగిలిస్తున్నారా? అయితే అది ఏ దిశలో పెట్టాలో తెలుసా?
