Just SpiritualLatest News

Horse Shoe : మీ ఇంటికి నల్ల గుర్రపు నాడా తగిలిస్తున్నారా? అయితే అది ఏ దిశలో పెట్టాలో తెలుసా?

Horse Shoe : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల గుర్రపు నాడా శని దేవుడికి అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. ఎందుకంటే నాడాను ఐరన్‌తో తయారు చేస్తారు. ఇనుము అనేది శని గ్రహానికి సంబంధించిన లోహంగా చెబుతారు.

Horse Shoe

చాలామంది తమ ఇళ్ల సింహద్వారం పైన, గుమ్మం మధ్యలోన ఇనుముతో చేసిన గుర్రపు నాడా (Horse Shoe)ను యూ (U) ఆకారంలో అమర్చుకుంటారు. కేవలం భారత దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో కూడా దీనిని ఒక అదృష్ట ప్రతీకగా, నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే వస్తువుగా భావిస్తారు. ముఖ్యంగా భారతీయ వాస్తు శాస్త్రం, జ్యోతిష్య పరిహారాలలో నల్ల గుర్రపు నాడాకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల గుర్రపు నాడా(Horse shoe) శని దేవుడికి అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. ఎందుకంటే నాడాను ఐరన్‌తో తయారు చేస్తారు. ఇనుము అనేది శని గ్రహానికి సంబంధించిన లోహంగా చెబుతారు. శని దోషాలు, ఏలిననాటి శని లేదా అర్ధాష్టమ శని ప్రభావంతో బాధపడేవారు తమ ఇంటి సింహద్వారం వద్ద నల్ల గుర్రపు నాడాను ఉంచడం వల్ల శని దేవుని ఆగ్రహం తగ్గి, అనుకూల ఫలితాలు వస్తాయని నమ్ముతారు.

అలాగే సొసైటీలో నరదృష్టి లేదా దిష్టి అతిపెద్ద సమస్యగా చెబుతారు. అందుకే నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని అంటారు. ఇంటిపై లేదా కుటుంబ సభ్యులపై పడే చెడు చూపులను, ఈర్ష్యా ద్వేషాలను ఈ గుర్రపు నాడా తన వైపు ఆకర్షించుకుని.. వాటి తీవ్రతను పూర్తిగా తగ్గిస్తుందని వాస్తు నిపుణులు చెబుతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం చూస్తే.. ఎవరి ఇంట్లోకి అయినా వెళ్లాలంటేనే సింహద్వారంను వాడతాం. దీని గుండానే పాజిటివ్ , నెగెటివ్ ఎనర్జీలు లోపలికి ప్రవేశిస్తాయి. అందుకే గుమ్మం పైన నాడాను ఉంచడం వల్ల అది ఒక ప్రొటెక్షన్‌గా పని చేస్తుంది.

ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు, నెగిటివ్ వైబ్రేషన్స్ రాకుండా ఈ గుర్రపు నాడా అడ్డుకుంటుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి ప్రశాంతత నెలకొంటుంది. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. కంపెనీలు, ఆఫీసుల మెయిన్ ఎంట్రన్స్ వద్ద దీనిని పెట్టడం వల్ల నష్టాలు తగ్గి లాభాల బాట పడుతుందని పెద్దలు చెబుతారు.

అయితే, ఈ గుర్రపు నాడాను గుమ్మం పైన పెట్టేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. మార్కెట్‌లో దొరికే కొత్త నాడాల కంటే, నల్లటి గుర్రం కాలికి ఉంటూ, అది నడుస్తున్నప్పుడు స్వయంగా ఊడి పడిపోయిన నాడాకు అత్యంత శక్తి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఈ నాడాను ఇంటికి పెట్టడానికి శనివారం అత్యంత అనుకూలమైన రోజుగా చెబుతారు. శనివారం ఉదయాన్నే గుర్రపు నాడా(Horse Shoe)ను శుభ్రం చేసి.. పూజ గదిలో ఉంచి ధూపదీపాలు చూపించిన తర్వాత సింహద్వారానికి తగిలించాలి.

వాస్తు ప్రకారం గుర్రపునాడా ఇంగ్లీష్ అక్షరం యు (U) ఆకారంలో అంటే రెండు అంచులు పైకి ఉండేలా పెట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే లక్ ఇంట్లోనే, బయటకు వెళ్లే నెగిటివ్ ఎనర్జీ బయటే నిలిచిపోతాయని అంటారు.

Horse Shoe
Horse Shoe

కొందరు దీనిని తలకిందులుగా అంటే రెండు అంచులు కిందికి ఉండేలా కూడా పెడతారు. దీనివల్ల నాడా ఒక కవచంగా పనిచేసి దిష్టి తగలకుండా ఉంటుందని నమ్ముతారు. కానీ ఎక్కువ శాతం మంది యు ఆకారంలో పెట్టడానికి చూస్తారు. ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఉత్తర, వాయువ్య లేదా పశ్చిమ దిశలలో ఉంటే ఇది ఇంకా అద్భుతంగా పని చేస్తుందని అంటారు.

గమనిక: దీనిలో పేర్కొన్న అంశాలు వాస్తు, జ్యోతిష్య పరిహారాలు , మనుషుల నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. దీనిలోని విషయాలను జస్ట్ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.

SIR : ఈరోజు నుంచే SIR.. మీ ఓటును ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి..

Related Articles

Back to top button