Movies : థియేటర్లు, ఓటీటీలో మూవీ లవర్స్‌కు పండుగే.. ఈ వీక్ అలరించబోయే ఆ 10 క్రేజీ మూవీస్ ఇవే..

Movies : ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలతో పాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, జీ5లలో స్ట్రీమింగ్ కానున్న క్రేజీ ఓటీటీ మూవీస్ ఏమున్నాయి?

Movies

బాక్సాఫీస్ వద్ద దీపావళి హంగామా ఇంకా చల్లారకముందే, ఈ వారం థియేటర్లు , ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎంటర్‌టైన్‌మెంట్ జాతర మొదలు కాబోతోంది. వెండితెరపై ఆడియన్స్‌ను అలరించడానికి ఏకంగా పదికి పైగా కొత్త సినిమాలు లైన్లో నిలబడ్డాయి.

ఇట్లు అర్జున, గోట్(G.O.A.T), భోగి, మాయ లేడీ, డార్క్ చాక్లెట్, దొంగ నా కొడుకు, చంద్రయాన్, జింగో పెన్, అ, అలాగే టాల్కమ్ పౌడర్ వంటి విభిన్న జోనర్‌ల చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయిపోయాయి. మరోవైపు ఓటీటీ లవర్స్ కోసం కూడా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అదిరిపోయే కంటెంట్‌ను అందించడానికి సిద్ధం అయ్యాయి.

ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 13వ తేదీన రణబాలి తెలుగు సినిమాతో పాటు హిందీ సినిమా దాయిరా, ఫ్రెంచ్ మూవీ ద గుడ్ లాయర్, ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ది బాడీ, ఇండోనేసియన్ మూవీ నెవర్ సరెండర్, కొరియన్ సిరీస్ మిరాకిల్స్ ఆఫ్ ఈఆర్, హార్ట్ ల్యాండ్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 12వ తేదీన క్రేజీ డబ్బింగ్ సినిమా జైలర్ 2 తో పాటు నవంబర్ 13వ తేదీన వైబ్ హిందీ మూవీ అలరించనున్నాయి. జియో హాట్‌స్టార్‌లో నవంబర్ 12వ తేదీన పుష్పకవిమానం తెలుగు వెబ్ సిరీస్, నవంబర్ 13వ తేదీన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ హిందీ సిరీస్ వస్తున్నాయి.

అలాగే జీ5లో నవంబర్ 11వ తేదీన బ్లైండ్ గేమ్, నవంబర్ 13వ తేదీన బాంద్రా తెలుగు డబ్బింగ్ మూవీ, అఫ్రాతఫ్రీ, మిర్గయ 1.5 వంటి మూవీలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేస్తున్నాయి. మొత్తానికి ఈ వీక్ అంతా థియేటర్లలో కొత్త సినిమాల జోరుతో పాటు ఓటీటీలో యాడ్ అవుతున్న క్రేజీ కంటెంట్‌తో మూవీ లవర్స్‌కు పూనకాలు తెప్పించే వీకెండ్ పక్కా అనే చెప్పాలి.

Pawan Kalyan Divorce : పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా డైవోర్స్..2 తెలుగు రాష్ట్రాలలో వైరల్ అవుతున్న పవన్ విడాకులు

↑
Exit mobile version