Rashmika
సినిమా స్టార్లకు ఉండే క్రేజ్ ఎంత గొప్పగా ఉంటుందో.. వారు ఎదుర్కొనే ఇబ్బందులు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. తాజాగా ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. తనపై జరుగుతున్న సోషల్ మీడియా దాడులపై గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఎనిమిదేళ్లుగా తనపై వస్తున్న విమర్శలు, తప్పుడు వార్తలు ఇప్పుడూ కూడా వినిపించడంతో తాజాగా లీగల్ వార్ ప్రకటించారు. తన పర్సనల్ లైఫ్‌ను కించపరిచేలా వ్యవహరిస్తున్న వారందరికీ ఆమె వార్నింగ్ ఇచ్చారు.
తన సోషల్ మీడియా వేదికగా రష్మిక తాజాగా ఒక పెద్ద పోస్ట్ చేస్తూ తన ఆవేదనను పంచుకున్నారు. కొందరు వ్యక్తులతో పాటు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కేవలం వారి పేజీలకు వ్యూస్, రీచ్ పెంచుకోవడం కోసం.. కావాలని తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆరోపించారు. తాను అనని మాటలను కూడా అన్నట్లుగా క్రియేట్ చేస్తూ, ఫేక్ వార్తలను ప్రచారం చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడెప్పుడో ఎనిమిదేళ్ల క్రితం నాటి ఒక ప్రైవేట్ ఆడియో క్లిప్‌ను ఇప్పుడు బయటకు తీసి మరీ, దాన్ని వక్రీకరించి ప్రచారం చేయడం తనను చాలా బాధపెట్టినట్లు అన్నారు.
అయితే ఈ వివాదంలోకి తన కుటుంబ సభ్యులను కూడా లాగడంపై రష్మిక(Rashmika) సీరియస్‌గా రియాక్టయ్యారు. ఇన్నేళ్లు ఓపికగా ఉన్నాను, కానీ నా వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తూ..తన కుటుంబాన్ని ఇబ్బంది పెడితే ఇకపై సహించేది లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. తనపై ఉన్న తప్పుడు కంటెంట్ , వీడియోలను 24 గంటల్లోగా తొలగించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఇలాంటి వారిపై రేపటి నుంచి లీగల్ నోటీసులు పంపడానికి కూడా ఆమె సిద్ధమయ్యారు.
ఇక రష్మిక(Rashmika) పర్సనల్ విషయానికి వస్తే, గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అయితే అది కొన్ని కారణాల వల్ల రద్దయింది. కానీ ఆ పాత విషయాలను ఇప్పుడు మళ్లీ తెరపైకి తెస్తూ కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారు.పెళ్లి చేసుకున్నాక కూడా ఆ పాత వీడియోలను పని గట్టుకుని వైరల్ చేస్తున్నారు. ఎవరి జీవితం వారిది, ఒకరి వ్యక్తిగత నిర్ణయాల గురించి ఎదుటవారు మాట్లాడే హక్కు లేదన్న కామన్‌సెన్స్ మర్చిపోతున్నారు.
కాగా, రష్మిక ఈ మధ్య టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట ‘రణబాలి’ అనే మూవీలో కలిసి నటిస్తున్నారు. పాత విషయాలను, పాత వివాదాలను పక్కన పెట్టి తన కొత్త జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న ఇలాంటి సమయంలో, ఇలా తప్పుడు ప్రచారాలు రావడంతో రష్మిక సీరియస్‌గా ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విజయ్, రష్మిక అభిమానులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
25.02.26
It was the Pradhanam and Mehendi evening. It was too perfect but it went off too fast.. ❤️
What a stunning piece you have created!!! @toraniofficial thank you for making it so special for us 🫶🏻 pic.twitter.com/czlU4qo2Ye
— Rashmika Mandanna (@iamRashmika) March 10, 2026
— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026
