SS Rajamouli
మనం కనే డ్రీమ్స్ అన్నీ రియల్‌లో జరగకపోవచ్చు. కానీ మన కలల కోసం లైఫ్‌ను కూడా పణంగా పెడితే అవి ప్రపంచాన్నే మనం శాసించే రేంజ్‌కి ఎదుగుతాయి. సరిగ్గా ఇదే సూత్రాన్నే నమ్మి, తెలుగు మూవీని గ్లోబల్ వైడ్‌లో నిలబెట్టి..తనకో మహోన్నత స్థానాన్ని సంపాదించుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli)).
అక్టోబర్ 10న జన్మించిన జక్కన్న జర్నీని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. కేవలం ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్థానం మాత్రమే కాదు.. కఠినమైన పరిస్థితులను ఎన్నో దాటుకుని విజయాన్ని సొంతం చేసుకున్న ఒక గొప్ప యోధుడి పోరాటం కనిపిస్తుంది. ఎలాంటి మూవీ బ్యాక్‌గ్రౌండ్, చివరకు ఫిల్మ్ స్కూల్ ట్రైనింగ్ కూడా లేకుండా, కేవలం సినిమాల పట్ల ఉన్న విపరీతమైన ప్రేమతో విజువల్స్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన రాజమౌళి..ఈరోజు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను రీ క్రియేట్ చేస్తున్నారు.
నిజానికి రాజమౌళి సినిమా ప్రయాణం అంత ఈజీగా ఏమీ సాగలేదు. ఒకప్పుడు ఫ్యామిలీతో కలిసి చెన్నైలోని చిన్న రెండు గదుల ఇంట్లో ఉంటూ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన రోజులు చాలానే ఉన్నాయి. సినిమా మేకింగ్ వెనుక ఉన్న అసలైన కష్టాన్ని తెలుసుకోవాలనే తపనతో.. ఎడిటింగ్, రికార్డింగ్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రతి డిపార్ట్‌మెంట్‌లోనూ కష్టపడ్డారు.
ముఖ్యంగా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసే స్టోరీల్లోని ఎమోషన్‌ను పట్టుకోవడంతోనే..రాజమౌళి(SS Rajamouli) అసలైన మ్యాజిక్ దాగి ఉందంటారు ఆయన గురించి బాగా తెలిసినవాళ్లు. సీన్ ఏదైనా, అది డైరెక్టుగా ప్రేక్షకుడి గుండెను తాకాలనేది రాజమౌళి నమ్మే మెయిన్ థియరీ. అందుకే స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ నుంచి ఈగ సినిమా వరకు ప్రతీ చిత్రంతో కూడా ఎప్పటికప్పుడు తన బౌండరీలను తానే దాటుకుంటూ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.
ఇక బాహుబలి మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీ రేంజ్‌ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన రాజమౌళి, కేవలం భారీ సెట్లు లేదా వీఎఫ్ఎక్స్ మాత్రమే కాకుండా, స్టోరీలో ఉండే అమ్మ ప్రేమ , మాట కోసం నిలబడే క్యారెక్టరైజేషన్‌తో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ కట్టిపడేశారు.
ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్ దిగ్గజాలు కూడా దిగివచ్చి చప్పట్లు కొట్టేలా చేశారు. నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్ వేదికపై భారతీయ జెండాను రెపరెపలాడించిన సమయంలో, ప్రపంచ సినిమా దిశే మారిపోయిందా అన్నట్లు చేశారు. ఆయన ఎప్పుడూ వెస్ట్రర్న్ కల్చర్‌ని ఫాలో అవలేదు. మన మట్టి వాసన ఉన్న కథలకే గ్లోబల్ రేంజ్‌లో ప్రాణం పోశారు.
ఎంతటి గొప్ప శిఖరానికి చేరినా కూడా ఇప్పటికీ కూడా తన మూలాలను మర్చిపోకపోవడమే రాజమౌళిలోని అతిపెద్ద స్పెషాలిటీ. ప్రపంచమంతా జక్కన్న విజయాన్ని వేడుక చేసుకుంటున్నా.. భార్య రమ, తండ్రి విజయేంద్ర ప్రసాద్, సోదరుడు కీరవాణి వంటి నిజాయితీగల విమర్శకుల సలహాలకే తన మొదటి ప్రాధాన్యత ఇస్తారు. సినిమాను ఎంటర్‌టైన్‌మెంట్‌గా మాత్రమే కాకుండా ఒక గొప్ప అనుభూతిగా మార్చేసిన మన జాక్ పాట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి(SS Rajamouli).. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.
Fake Promotions : బెస్ట్ డాక్టర్ రూల్స్‌కి చెక్..సోషల్ మీడియాలో ఫేక్ ప్రమోషన్లకు చెల్లు..
