Teja Sajja Engagement : సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తేజ సజ్జా..డిసెంబర్‌లో పెళ్లి

Teja Sajja Engagement : యంగ్ హీరో తేజ సజ్జా గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. డిసెంబర్‌లో ఉదయ్‌పూర్ వేదికగా పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఆ అమ్మాయి ఎవరు? ఎంగేజ్‌మెంట్‌కు వచ్చిన సెలబ్రిటీల సందడితో పాటు తేజ క్రేజీ లైనప్ ఏంటి?

Teja Sajja Engagement

టాలీవుడ్ యంగ్ స్టార్ తేజ సజ్జా పర్సనల్ లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ఈ హనుమాన్ హీరో, ఇక బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసి కొత్త జర్నీకి రెడీ అయ్యారు. హైదరాబాద్‌లో ఫ్యామిలీ మెంబర్స్, అత్యంత ఆత్మీయుల సమక్షంలో తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్(Teja Sajja Engagement) గ్రాండ్‌గా జరిగింది.

హనుమాన్ హీరో ఎంగేజ్‌మెంట్ వేడుకకు పొలిటికల్, ఫిలిం ఇండస్ట్రీకి చెందిన బడా సెలబ్రెటీలు తరలివచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు టాలీవుడ్ నుంచి లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు, యంగ్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ, కార్తిక్ ఘట్టమనేని కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు.

ఇక హీరోలు రవితేజ, నాని, రానా, శివాజీ, వరలక్ష్మి శరత్‌కుమార్ దంపతులు వచ్చి ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, సాహూ గారపాటి, రైటర్ కోన వెంకట్ వంటి సెలబ్రెటీలు ఈ వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఎంగేజ్‌మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్స్‌గా మారిపోయాయి.

ఇక డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని రాయల్ విలేజ్ ఉదయ్‌పూర్ వేదికగా తేజ వివాహ వేడుక జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను కేవలం రెండు కుటుంబాల వారితో పాటు బాగా దగ్గరి బంధువుల మధ్య ప్రైవేట్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో సినీ, పొలిటికల్ సెలబ్రెటీల కోసం సకల సౌకర్యాలతో కూడిన గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

తేజకు కాబోయే భార్యకు ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఆమె యూఎస్‌లోనే పెరిగారు. ప్రస్తుతం తన తండ్రితో కలిసి ఐటీ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇది పక్కా పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడమే కాకుండా.. ఆమె పేరును మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంచడం విశేషం.

Teja Sajja Engagement

కెరీర్ పరంగా చూస్తే తేజాకి మైలురాయిలా నిలిచిన జాంబిరెడ్డికి సీక్వెల్‌గా ‘జాంబిరెడ్డి 2 నెక్స్ట్ లెవెల్’ తాజాగా అనౌన్స్ చేశారు. దీంతోపాటు ఇప్పటికే సెట్స్ మీదున్న హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అలానే రీసెంట్‌గా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన మిరాయ్ ప్రాజెక్ట్‌ సీక్వెల్‌ మిరాయ్ 2 రెడీ అవుతోంది.

US Flights Disruption : అగ్రరాజ్యానికీ తప్పని టెక్ డ్రామా..అమెరికా వ్యాప్తంగా నిలిచిపోయిన వేలాది ఫ్లైట్లు..

↑
Exit mobile version