US Flights Disruption
ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఏవియేషన్ నెట్‌వర్క్ ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కసారిగా ఊహించని పెద్ద సిస్టమ్ క్రాష్ ఎదురైంది. ఫ్లైట్ ఎక్కడం అంటే వేగం, సౌకర్యానికి కేరాఫ్ అడ్రస్ అనుకునేవారికి అక్కడ ఎదురైన అనుభవం చాలా ఇబ్బందుల్లోకి నెట్టింది.
దేశవ్యాప్తంగా ఫ్లైట్స్ రాకపోకలను గైడ్ చేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సిస్టం ఉన్నట్టుండి స్తంభించిపోవడంతో వేలాదిగా విమానాలు క్యాన్సిల్ అయ్యాయి మరికొన్ని ఫ్లైట్స్(US Flights Disruption) అయితే గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. అయితే ఈ సిస్టంను ఇంకా బెటర్‌గా ఆధునికీకరించేటపుడు చేసిన ఒక చిన్న ఆపరేషనల్ పొరపాటే ఈ రేంజ్ సంక్షోభానికి దారితీసింది.
అసలు ఈ సిస్టం క్రాష్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే.. అమెరికా ఏవియేషన్ సిస్టంలో దశాబ్దాల నాటి పాత కాపర్ వైర్లను తొలగించి, వాటి ప్లేస్‌లో హై-స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను అప్‌గ్రేడ్ చేసే పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ పనులను పర్యవేక్షిస్తున్న కాంట్రాక్టర్ L3Harris కంపెనీకి సంబంధించిన ఒక రిమోట్ లోకేషన్ నెట్‌వర్క్‌లో ఉన్న రూటర్‌లో ప్రాబ్లెమ్ మొదలైందని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ తెలిపారు.
ఆ రూటర్ నుంచి ప్రతి 4 నుంచి 5 సెకన్లకు వెయ్యికి పైగా కనెక్షన్ రిక్వెస్ట్‌లు విపరీతంగా దూసుకొచ్చాయి. దీనివల్ల నెట్‌వర్క్‌లోని మిగిలిన రూటర్లు, స్విచ్‌లపై తట్టుకోలేనంత లోడ్ పడిపోయి ఒక్కసారిగా క్రాష్ అయిపోయాయి. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు(US Flights Disruption) గాల్లో వెళ్లే ఫ్లైట్స్‌తో మాట్లాడటానికి, రాడార్ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయడానికి ఉన్న ప్రాథమిక లైన్లు కట్ అయ్యాయి. అమెరికాలో మొత్తం 22 కీలక ఎన్‌రూట్ ఏటీసీ సెంటర్స్‌లో ఏకంగా 17 కేంద్రాలు ఈ ఎఫెక్ట్‌తో కనెక్షన్ కోల్పోయాయి.
అయితే ప్రయాణీకుల సేఫ్టీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదుఅనే ఉద్దేశంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వెంటనే సీన్లోకి దిగి దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లపై టెంపరరీగా గ్రౌండ్ స్టాప్ ఆంక్షలను విధించింది. నెట్‌వర్క్ నిపుణులు ఆ సమస్యాత్మక పరికరాన్ని మెయిన్ లైన్ నుంచి ఐసోలేట్ చేసిన తర్వాత ఫ్లైట్స్ కదలికలు మళ్లీ మొదలయ్యాయి. ఇది కాంట్రాక్టర్ వైపు నుంచి జరిగిన హ్యూమన్ ఎర్రరా లేక హార్డ్‌వేర్ లోపమా అనే దానిపై ఇప్పుడు ఎంక్వైరీ కొనసాగుతోంది. అయితే ఈ సయయంలో ఎలాంటి సైబర్ అటాక్ జరిగినట్లు ఆధారాలు లేవని అధికారులు తేల్చి చెప్పారు.
అమెరికా ఏవియేషన్‌లో ఇలాంటి టెక్నికల్ గ్లిచ్‌లు ఎదురవడం ఇదే తొలిసారి ఏమీ కాదు. 2023 జనవరిలో కూడా FAAకి చెందిన NOTAM వ్యవస్థ క్రాష్ అవ్వడంతో దేశవ్యాప్తంగా పైలట్లకు అందాల్సిన ఎమర్జెన్సీ అలర్ట్స్ ఆగిపోయాయి. అప్పట్లో రాత్రికి రాత్రే ఫ్లైట్లన్నీ నిలిపివేయగా దాదాపు 1,300 విమానాలు క్యాన్సిల్ అయి, 10 వేలకు పైగా సర్వీసులు లేట్ అయ్యాయి.
అలాగే 2025 మొదట్లో, సెప్టెంబర్ 2026లో ఫిలడెల్ఫియా కంట్రోల్ సెంటర్‌లో కేబుల్ కట్ అవ్వడం వల్ల సుమారు 9,500 ఫ్లైట్స్‌పై ఎఫెక్ట్ పడింది. అమెరికా ప్రభుత్వ GAO రిపోర్ట్ ప్రకారం, అక్కడ వాడుతున్న 138 కీలక ఏటీసీ సిస్టమ్స్‌లో 51 వ్యవస్థలు చాలా పాతబడిపోయి ఏ క్షణమైనా చేతులెత్తేసే స్థితిలో ఉన్నాయని తేలడం గమనార్హం.
కాగా ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ 13వ తేదీన ఐదు గంటల పాటు విధించిన గ్రౌండ్ స్టాప్‌తో ఎయిర్‌పోర్టులన్నీ కిటకిటలాడిపోయాయి. రీసెర్చ్ డేటా ప్రకారం నవంబర్ 14వ తేదీకే 10,000 విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. ఇక ఆ మరుసటి రోజు నవంబర్ 15వ తేదీకి మరో 11,500 కంటే ఎక్కువ ఫ్లైట్లు ఆలస్యంగా నడవడం, క్యాన్సిల్ అవ్వడం జరిగాయి.
పైలట్లు, సిబ్బంది ఎక్కడివారక్కడ నిలిచిపోవడంతో ఎయిర్‌లైన్స్ కంపెనీల రీ-షెడ్యూలింగ్ ప్లాన్స్ తలకిందులయ్యాయి. కాకపోతే ఈ సడన్ క్రాష్ వల్ల మొత్తం ఎన్ని మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందనే దానిపై అఫీషియల్ లెక్కలు ఇంకా బయటకు రాలేదు.
ఈ సంఘటన తర్వాత ఏటీసీ మోడరనైజేషన్‌పై ఫోకస్ పెట్టాలని.. వెంటనే కాంగ్రెస్ నుంచి నిధులు మంజూరు చేయించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. అలాగే దేశవ్యాప్తంగా పాతబడిపోయిన టెక్ మౌలిక సదుపాయాలను పూర్తిగా ఫైబర్ ఆప్టిక్ నెక్స్ట్ జెన్ సిస్టమ్స్‌గా మార్చడానికి సుమారు 50 బిలియన్ డాలర్ల వరకు భారీ ఫండ్స్ అవసరమవుతాయని రవాణా మంత్రి సీన్ డఫీ చెప్పారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతం అయిన దేశమైనా సరే, పాతబడిపోయిన సిస్టమ్స్‌ను సకాలంలో అప్‌గ్రేడ్ చేయకపోతే ఎలాంటి పెద్ద నెట్‌వర్క్ సంక్షోభం ఎదురవుతుందో ఈ లేటెస్ట్ ఫ్లైట్ ఇన్సిడెంట్ మరోసారి రుజువు చేసింది.
Rumours : రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తారు? దీనిపై సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?
