Teja Sajja
సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ తేజ సజ్జా(Teja Sajja) త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. తన పర్సనల్ విషయాలను పబ్లిక్ లైమ్‌లైట్‌కు ఎప్పుడూ దూరంగా ఉంచే తేజ.. రీసెంట్గా తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ త్వరలోనే తాను మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నట్లు చెప్పి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు.
నవంబర్ నెలలో తేజ ఎంగేజ్మెంట్ జరగనుండగా,డిసెంబర్లో రాజస్థాన్‌లోని రాయల్ సిటీ ఉదయ్‌పూర్‌లో ఈ వివాహ వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని, తన తల్లిదండ్రులే ఈ సంబంధం సెట్ చేశారని తేజ క్లారిటీ ఇచ్చాడు.
ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావు లేకుండా కుటుంబ సభ్యులు అలాగే అత్యంత సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి తంతు జరగనుంది. ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుక పూర్తయిన తర్వాత, టాలీవుడ్ ఫ్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ సెలబ్రెటీల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఇవ్వనున్నారు.
ఇక తనకు కాబోయే సతీమణి గురించి చెప్పిన తేజ .. ఆమెకు సినిమా ప్రపంచంతో ఎలాంటి లింక్స్ లేవని చెప్పాడు. ఆమె ఫ్యామిలీ టెక్నాలజీ రంగంలో ఉంటోందని, తన తండ్రితో కలిసి బిజినెస్ చూసుకుంటోందని తెలిపాడు. త్వరలోనే న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్న తేజ(Teja Sajja)కు ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున విషెస్ అందుతున్నాయి.
Sonia Gandhi : ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ ఎంట్రీ..ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన బిలాంగింగ్ ఆత్మకథ!
