Just NationalJust PoliticalLatest News

Sonia Gandhi : ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ ఎంట్రీ..ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన బిలాంగింగ్ ఆత్మకథ!

Sonia Gandhi : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన ఆత్మకథ పుస్తకం 'Belonging: A Journey of Love' ఫస్ట్ లుక్, ప్రచురణ వివాదాలు, కుటుంబ ఎమోషన్స్ వంటి వివరాలను రివీల్ చేశారు.

Sonia Gandhi

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు . 79 ఏళ్ల వయసులో ఆమె ఫస్ట్ టైమ్‌ ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతూ, త్వరలో రాబోతున్న తన ఆత్మకథ పుస్తకం ‘Belonging: A Journey of Love’ ఫస్ట్ లుక్ వీడియోను షేర్ చేశారు.

ప్రేమ, కర్తవ్య నిర్వహణ, వ్యక్తిగత నష్టం, లైఫ్‌లో తనకంటూ ఒక స్థానం కోసం సాగించిన అన్వేషణను ఈ బుక్‌లో ఆవిష్కరించినట్లు సోనియా తన ఫస్ట్ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు. నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ బుక్‌కు సంబంధించి తొలి హార్డ్‌బ్యాక్ కాపీలు అందుకున్న వీడియోను కూడా సోనియా(Sonia Gandhi) షేర్ చేశారు.

ఆ బుక్స్ బరువుపై సరదా కామెంట్లు చేస్తూ.. కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు. చాలా ఫొటోలు ఉన్నాయి ప్రియాంక అని సోనియా అనగా, ప్రియాంక తల్లికి స్వీట్ తినిపించి ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఈ బుక్‌లో సోనియా గాంధీ(Sonia Gandhi) తన 6 దశాబ్దాల ఇండియన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందరితో పంచుకోనున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో గడిపిన బాల్యం అలాగే 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో రాజీవ్ గాంధీతో పరిచయం, ప్రేమ, 1968 ఫిబ్రవరి 25వ తేదీన పెళ్లి.. ఆ తర్వాత నెహ్రూ-గాంధీ ఫ్యామిలీలోకి అడుగు పెట్టాక జరిగిన ఇంపార్టెంట్ విషయాలను దీనిలో ప్రస్తావించారు.

1984లో అత్తయ్య ఇందిరా గాంధీ హత్య, 1991లో తన భర్త రాజీవ్ గాంధీ దారుణ హత్య వంటి విషాదాలు సోనియా లైఫ్‌ను ఎంతగా కుదిపేశాయో వివరించారు. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎక్కువ కాలం పనిచేయడం, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయడం, 2014 రాజకీయ మార్పులు వరకు అన్ని విషయాలను టచ్ చేశారు. తమ ఫ్యామిలీని కేవలం పొలిటికల్ లీడర్లుగా కాకుండా, భావోద్వేగాలు ఉన్న మనుషులుగా అర్థం చేసుకోవడానికే ఈ పుస్తకం రాశానని సోనియా తెలిపారు.

అయితే ఈ బుక్ పబ్లిష్ అయ్యేటపుడు ఒక పెద్ద పొలిటికల్ వివాదమే నడిచింది. మొదట పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా కంపెనీతో ఒప్పందం ఉన్నా.. ఎడిటోరియల్ రివ్యూలో ఒక పాయింట్‌పై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అగ్రిమెంట్ రద్దయింది. బయటి ఒత్తిళ్ల వల్లే పెంగ్విన్ వెనక్కి తగ్గిందని కాంగ్రెస్ ఆరోపించినా.. పెంగ్విన్ దానిని ఖండించింది.

ప్రస్తుతం భారత్‌లో ఈ పుస్తక పబ్లిషింగ్ బాధ్యతలను హార్పర్‌కాలిన్స్ ఇండియా తీసుకోగా, గ్లోబల్ వైడ్‌గా ఆల్ఫ్రెడ్ ఏ. నాప్ సంస్థ పబ్లిష్ చేస్తోంది. కాగా తన తల్లి జీవిత అనుభవాలు బుక్ రూపంలో ప్రపంచానికి తెలియడంపై రాహుల్ గాంధీ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Sonia Gandhi (@soniagandhi)

Devara Gattu Bunny Ustavam : ప్రాణాలు పోతున్నా మారని విశ్వాసం..రక్తం చిందుతున్నా వెనక్కి తగ్గని మూర్ఖత్వం

Related Articles

Back to top button