Tharun Bhascer
కొన్నిరిలేషన్స్ విలువ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. లైఫ్‌లో సంతోషంగా ఉన్నప్పుడు పక్కన ఉండేవాళ్ల కంటే,వారి జీవితంలో సమస్యలు చుట్టుముట్టినప్పుడు ధైర్యం చెప్పే వ్యక్తులే ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ లైఫ్‌లో ఈషా రెబ్బ అలాంటి వ్యక్తి అని ఆయన తల్లి, నటి గీతా భాస్కర్ చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొడుకు గురించి మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
తరుణ్ భాస్కర్(Tharun Bhascer), ఈషా రెబ్బ ప్రేమలో ఉన్నారనన్న వార్తలు కొంతకాలంగా టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వినాయక చవితి సందర్భంగా ఈషాతో కలిసి ఉన్న ఫోటోను తరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరిద్దరి రిలేషన్‌పై ఒక క్లారిటీ స్పష్టత వచ్చింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం తరుణ్ భాస్కర్(Tharun Bhascer) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ నవంబర్ 19వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న గీతా భాస్కర్ తన కొడుకు ఈ రెండేళ్లలో ఎదుర్కొన్న పరిస్థితులను ఒకసారి అందరి ముందూ గుర్తుచేసుకున్నారు. తరుణ్ లైఫ్‌లో ఒకానొక సమయంలో చాలా సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. కోర్టు కేసులు, ఇల్లు కట్టడం వంటి పనులతో చాలా బిజీ అయిపోయాడని చెప్పారు.
కొన్ని రోజులు అయితే ఇంటికి కూడా వచ్చేవాడు కాదని, వచ్చినా అర్ధరాత్రి వచ్చి భోజనం చేసి వెళ్లిపోయేవాడని గీతా భాస్కర్ వివరించారు. అలాంటి పరిస్థితుల్లో తరుణ్‌కు అండగా నిలిచిన వ్యక్తి ఈషా రెబ్బ అని చెప్పిన ఆమె.. ఈషా కేవలం ఒక స్నేహితురాలు మాత్రమే కాదని, తరుణ్‌కు ఆత్మీయురాలిగా, సపోర్ట్ సిస్టంగా, కుటుంబ సభ్యురాలిగా మారిందని చెప్పారు.
ఒక తల్లిగా తనకు కూడా వయసు పెరుగుతోందని, కొడుకు లైఫ్‌లో అతడిని అర్థం చేసుకునే వ్యక్తి ఉండాలని తానెప్పుడూ కోరుకునేదాన్నని గీతా భాస్కర్ చెప్పుకొచ్చారు. స్నేహితులు ఉన్నా కూడా వారితో అన్ని విషయాలు పంచుకోలేమని, జీవితంలో ఒక మంచి లైఫ్ పార్ట్నర్, ఆత్మీయమైన తోడు ఉండటం ఎంతో అవసరమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తరుణ్‌కు ఈషా ఇస్తున్న మద్దతు చూసి తనకు చాలా ధైర్యం వచ్చిందని చెబుతూ ఆమెకు ప్రత్యేకంగా గీతా భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఈషా హాజరు కాకపోయినా కూడా తరుణ్‌కు అద్భుతమైన తోడుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.మొత్తంగా తన కొడుకు జీవితంలో ఒక మంచి వ్యక్తి తోడుగా ఉన్నారనే సంతోషం ఆమె మాటల్లో అందరికీ కనిపించింది.
సాధారణంగా సినిమా వేడుకల్లో హీరోలు, డైరెక్టర్ తమ సినిమా విశేషాలు చెబుతుంటారు. కానీ ఈసారి గీతా భాస్కర్ మాటలు మాత్రం సినిమా కంటే తరుణ్ పర్సనల్ లైఫ్‌లో జరిగిన విషయాలపై అందరి దృష్టిని మళ్లించాయి. ముఖ్యంగా ఈషా గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Hyderabad IMAX : ఐమ్యాక్స్ గ్రాండ్ రీ-ఎంట్రీ..11 ఏళ్ల తర్వాత హైదరాబాదీలకు పండుగే..
