Hyderabad IMAX
హైదరాబాద్‌లోని మూవీ లవర్స్‌కు టాలీవుడ్ మైండ్ బ్లాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. దశాబ్ద కాలంగా భాగ్యనగర వాసులు చాలా కాలం నుంచి మిస్ అవుతున్న ఒరిజినల్ ఐమ్యాక్స్(Hyderabad IMAX) థియేటర్ ఫీల్ మళ్లీ సిటీలో షురూ కాబోతోంది. సుమారు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హయ్యస్ట్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఐమ్యాక్స్ స్క్రీన్ టాలీవుడ్ హబ్‌లో కొలువుదీరబోతోంది.
సినీ అభిమానులకు కేరాఫ్ అడ్రస్‌గా స్టాంప్ వేసుకున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వేదికగా..ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకుంటున్న ‘ఏఎంబీ విక్టరీ సినిమాస్’ కాంప్లెక్స్‌లో ఈ ఐమ్యాక్స్(Hyderabad IMAX) స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు వెనుక టాలీవుడ్ బడా స్టార్స్ మహేశ్ బాబు, దగ్గుబాటి వెంకటేశ్ ఉన్నారు. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో పార్ట్‌నర్స్‌గా వీరు ఈ సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్ క్రియేట్ చేసిన రికార్డుల తర్వాత, అదే రేంజ్‌లో మరో ఐకానిక్ సెంటర్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం 7 అడ్వాన్స్‌డ్ స్క్రీన్లు ఉండబోతున్నాయి. అందులో ప్రపంచ స్థాయి ప్రొజెక్షన్ అందించే ‘ఐమ్యాక్స్ విత్ లేజర్’ (IMAX with Laser) స్క్రీన్ మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనుంది. దీంతో పాటు మోషన్ సీట్లు, విజువల్ ఎఫెక్ట్స్ అనుభూతినిచ్చే ఒక 4డీఎక్స్ (4DX) స్క్రీన్, మరికొన్ని రెగ్యులర్ స్క్రీన్లను రెడీ చేస్తున్నారు.
ఐమ్యాక్స్ కార్పొరేషన్‌తో ఏషియన్ సినిమాస్ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ హంగులు సిద్ధమవుతున్నాయి. అల్ట్రా-హై డెఫినిషన్ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ 3డీ క్వాలిటీ, హార్ట్ బీట్‌ను ఒక్కసారిగా పెంచే క్రిస్టల్ క్లియర్ సౌండింగ్‌తో ఈ లేజర్ ప్రొజెక్షన్ థియేటర్ ఆడియన్స్‌ను మంత్రముగ్ధులను చేయనుంది. గతంలో ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో రీల్ టెక్నాలజీ మారడంతో నిలిచిపోయిన ఈ సేవలు.. ఇప్పుడు నయా 4కే లేజర్ డెసిషన్‌తో హైదరాబాద్ తిరిగి వస్తుండటంతో మూవీ లవర్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
