Tollywood
కొత్త ఏడాదిలో అప్పుడే మూడు నెలలు పూర్తయిపోయాయి. వ్యాపార కోణంలో చెప్పాలంటే పాత ఆర్థిక సంవత్సరం ముగిసి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మొదలైంది. అటు సినిమా ఇండస్ట్రీ పరంగా చూస్తే ఈ మూడు నెలల రిపోర్ట్ ఏంటనే చర్చ జరుగుతోంది. నిజానికి సంక్రాంతి నుంచి మార్చి చివరి వరకూ టాలీవుడ్(Tollywood) మిశ్రమ ఫలితాలను చవిచూసింది. సంక్రాంతికి బాక్సాఫీస్ పెద్ద సినిమాలతో కళకళలాడింది.
వీటిలో నిలబడింది కొన్నే అయినా కూడా సందడికి మాత్రం కొదవలేదు. సంక్రాంతి కానుకగా మొదట వచ్చిన ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిజాస్టర్ అయింది. అయితే ఆ తర్వాత మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు ఎంట్రీతో బాక్సాఫీస్ షేక్ అయింది. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేయగా.. నయనతార హీరోయిన్ గా నటించింది.
300 కోట్ల క్లబ్ లో చేరి సంక్రాంతి హిట్ గా నిలిచింది. ఇక రవితేజ – కిశోర్ తిరుమల కాంబినేషన్లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జస్ట్ ఓకే అనిపించుకుంది. శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు’ ప్రేక్షకులను మెప్పిచాయి. ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి.
ఇక ఫిబ్రవరిలో చెప్పుకోదగిన చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘యుఫోరియా’ మంచి సినిమాగా నిలిచింది. కమర్షియల్ గా మాత్రం నిరాశపర్చింది. పెద్దగా కలెక్షన్లు కూడా రాలేదు. విశ్వక్ సేన్ ‘ఫంకీ’, సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.
వీటితో పాటూ నిలవే, స్కై, అమరావతికి ఆహ్వానం లాంటి మరో 5 సినిమాలు వచ్చి వెళ్లిపోయాయి. ఆ వెంటనే విష్ణు విన్యాసం, సన్నాఫ్, ఉత్తుత్త హీరోలు మెప్పించలేదు. అలాగే మార్చిలోనూ పెద్దగా సానుకూల ఫలితాలు ఏమీ రాలేదు. శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ పాస్ మార్కులు తెచ్చుకున్నా కలెక్షన్లు రాబట్టలేదు.
శివాజీ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’, వరలక్ష్మి ‘ఎస్ సరస్వతి’ కూడా అనుకున్నఫలితాలు సాధించలేదు. ఇక ఉగాది కానుకగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అభిమానులను ఆకట్టుకుంది. దాదాపు 100 కోట్ల వరకూ కలెక్ట్ చేసిన ఈ మూవీకి హిందీ మూవీ ధురంధర్ దెబ్బకొట్టింది. ఓవరాల్ గా ఈ మూడు నెలల టాలీవుడ్(Tollywood) రిపోర్టును చూస్తే కేవలం సంక్రాంతికి మాత్రమే హిట్ పడింది. తర్వాత రెండు నెలలు పాస్ మార్కులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Oracle Layoffs : 30 వేల మందిని పీకేశారు…ఉద్యోగులకు ఒరాకిల్ షాక్
