Toxic
మూవీ రిలీజ్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయించడం ఒక ఎత్తయితే, ఆ వెయిటింగ్‌ను నెక్ట్స్ లెవల్ హైప్‌గా మార్చి థియేటర్ల దగ్గర సునామీ క్రియేట్ చేయడం మరో ఎత్తు. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన టాక్సిక్ మూవీ సరిగ్గా ఇదే పనిచేసింది.
ఎన్నో వాయిదాలు, మరెన్నో గ్యాప్‌ల తర్వాత ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి దిగిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వేటను మాత్రం ముందే మొదలుపెట్టేసింది. రిలీజ్‌కు ముందే ప్రీ-సేల్స్ బుకింగ్స్‌లో రికార్డులను తిరగరాస్తూ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో మైండ్ బ్లాకింగ్ టాక్‌గా మారింది.
ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారత్‌లోనే టాప్ రికార్డుతో ఊపేసిన ధురంధర్ 2.. తుపాన్‌ను టాక్సిక్ అలవోకగా దాటేసింది. ధురంధర్ 2 సినిమా ప్రీ-సేల్స్‌లో 14 లక్షల టికెట్లు సేల్ అయితే, యశ్ మేనియాతో టాక్సిక్ మూవీ ఏకంగా 16 లక్షల టికెట్లను సేల్ చేసి కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.
ఈ రేంజ్ ఓపెనింగ్స్ చూస్తున్న సినీ విశ్లేషకులు..మొదటి రోజే చాలా ఈజీగా రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటున్నారు. మరోవైపు మూవీ రిలీజ్ సమయంలో మేకర్స్ నుంచి ఓ స్పెషల్ రిక్వెస్ట్ వచ్చింది. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ పై మూవీ యూనిట్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
ఇది కేవలం ఒక మూవీ మాత్రమే కాదని, ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్లు రాత్రింబవళ్లు పడిన కష్టానికి ప్రతిరూపమని చెబుతూ.. థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేసే సమయంలో ఎవరూ ఫోన్లలో సీన్లు రికార్డ్ చేసి నెట్‌లో పెట్టొద్దని అలాగే మూవీలోని ట్విస్టులను బయటపెట్టి ఇతరుల ఎక్స్‌పీరియన్స్‌ను పాడు చేయొద్దని స్పెషల్ రిక్వెస్ట్ చేసింది.
పెద్ద స్క్రీన్ పై అందరితో కలిసి ఈ టాక్సిక్ మాస్ జాతరను ఫీల్ అవ్వాలని మూవీ టీమ్ విజ్ఞప్తి చేసింది.మొత్తంగా రిలీజ్‌కు ముందే అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోవడంతో.. మూవీ టాక్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఎవరి ఊహకు అందందంటూ యశ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
Camphor Hair Mask : జుట్టు చిట్లిపోతోందా? కర్పూరంతో ఇంట్లోనే వేసుకునే మ్యాజిక్ హెయిర్ మాస్క్..
