Black Coffee
ఒకప్పుడు బీపీ, షుగర్ అన్న మాటలు ఎంత కామన్‌గా వినేవాళ్లమో..ఇప్పుడు ఫ్యాటీ లివర్ గురించి కూడా అలాగే వింటున్నాం. అయితే ఫ్యాటీ లివర్‌లో గ్రేడ్‌లు ఉండటం కొంత ఆందోళన కలిగించే విషయం. ఒకటి రెండు గ్రేడ్‌లు అందరిలో కనిపిస్తున్నా.. మూడో గ్రేడ్‌లో కూడా ఫ్యాటీ లివర్‌ను గుర్తించకపోతే మాత్రం అది సిర్రోసిస్‌కు వెళ్లి క్యాన్సర్ , లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకూ వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
అందుకే ముందుగానే ఫ్యాటీ లివర్‌కు బ్లాక్ కాఫీ(Black Coffee)తో ఈజీగా చెక్ పెట్టొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. రోజుకు 2,3 సార్లు బ్లాక్ కాఫీని(Black Coffee) తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని అంటున్నారు. అయితే దీనికోసం ఇన్‌స్టెంట్ కాఫీ పౌడర్‌ను వాడొద్దని.. కాఫీ బీన్స్ నుంచి గ్రైండ్ చేసి అమ్మే కాఫీ పౌడర్‌ను వాడాలని పర్టిక్యులర్‌గా చెబుతున్నారు. దీంతో చాలామంది రెండూ కాఫీ బీన్స్ నుంచి వచ్చేవే కదా మరి డాక్టర్లు ఎందుకు అలా చెబుతున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అందుకే చాలా మంది నుంచి ఈ ప్రశ్న వినిపించేసరికి దీనికి గల కారణాన్ని నిపుణులు వివరిస్తున్నారు. కాఫీ బీన్స్‌ను డైరెక్టుగా గ్రైండ్ చేసి డికాక్షన్ తీసే కాఫీలో.. కెఫిన్‌తో పాటు క్లోరోజెనిక్ యాసిడ్స్, కాఫెస్టాల్, కాహ్వియోల్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో, సహజ సిద్ధంగా ఉంటాయి.
ఇవన్నీ లివర్ చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి అలాగే కాలేయంలో వచ్చే వాపులను (Inflammation) కూడా తగ్గించడానికి ఒక మెడిసిన్‌లా పనిచేస్తాయి.
కానీ ఇన్‌స్టెంట్ కాఫీ పౌడర్‌ను తయారు చేసే ప్రాసెస్ వల్ల ఇవేమీ ఉండవు. ఎలా అంటే కాఫీ బీన్స్ నుంచి ఆల్రెడీ లిక్విడ్ తీసి, ఆ లిక్విడ్‌ను హై టెంపరేచర్ వద్ద ఫ్రీజ్ డ్రైయింగ్ ఆర్ స్ప్రే డ్రైయింగ్ అనే కెమికల్ అండ్ మెకానికల్ ప్రాసెస్ ద్వారా పౌడర్‌గా మారుస్తారు.
ఈ భారీ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు కాఫీలో నేచురల్‌గా ఉండే చాలా రకాల పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ లివర్‌ను తగ్గించే ఇంపార్టెంట్ కాంపౌండ్స్ చాలా వరకు నశిస్తాయి.
దీనికి తోడు ఇన్‌స్టెంట్ కాఫీ పౌడర్ లాంగ్ లైఫ్ ఉండటం కోసం, అలాగే మంచి టెక్స్చర్ కోసం కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ , యాంటీ-కేకింగ్ ఏజెంట్స్ కలిసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా హై-హీట్ ప్రాసెసింగ్ వల్ల ఇన్‌స్టెంట్ కాఫీలో అక్రిలమైడ్ అనే కెమికల్ కాంపౌండ్ మోతాదు కొంచెం పెరుగుతుంది.
ఇది లివర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారెవరయినా సరే.. లివర్‌ను డీటాక్స్ చేసుకోవడానికి ప్యూర్ కాఫీ బీన్స్ పౌడర్ కానీ ఫిల్టర్ కాఫీ పౌడర్ నుంచి కానీ బ్లాక్ కాఫీ(Black Coffee) చేసుకుని తాగాలి. అంతేతప్ప ప్రాసెస్డ్ ఇన్‌స్టెంట్ పౌడర్లను వాడకూడదని డాక్టర్లు సలహా ఇస్తుంటారు.
Rosemary : ఇంట్లో రోజ్ మేరీ ఉంటే చాలు.. అన్ని రకాలుగా వాడేసుకోవచ్చు..
