Eggs
సమ్మర్‌లో గుడ్డు తింటే ఒంట్లో వేడి పెరుగుతుందని, అది ఆరోగ్యానికి ప్రమాదకరమని చాలామంది గుడ్డుకు దూరంగా ఉంటారు. కానీ నిజానికి గుడ్లు తినడానికి, రుతువులకు ఎటువంటి సంబంధం లేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే గుడ్డు మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందించే ఒక సంపూర్ణ ఆహారంగా డాక్టర్లు చెబుతారు. కాబట్టి కేవలం ఎండాకాలం అని చెప్పి మీ డైట్ నుంచి గుడ్లను పక్కన పెట్టాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.
అయితే ఏ సీజన్‌లో అయినా కూడా గుడ్లు ఎవరికి సురక్షితం అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్ విషయంలో ప్రతి ఒక్కరి శరీర తత్వం వేరుగా ఉంటుంది. కొంతమందికి ఎగ్స్ తిన్నప్పుడు కడుపులో నొప్పి రావడం, అజీర్ణం లేదా అలర్జీలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి ఇబ్బందులున్నవారు మాత్రం గుడ్ల వినియోగాన్ని తగ్గించుకోవడం మంచిది. అయితే సాధారణ ఆరోగ్యంతో ఉన్న ఎవరైనా సరే గుడ్లను ఎంచక్కా తినవచ్చు, దీనివల్ల శరీరానికి మంచి ప్రోటీన్లు అందుతాయి.
మరి ఒక మనిషి రోజుకు ఎన్ని గుడ్లు తినాలనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు రెండు నుంచి 4 గుడ్ల వరకు హ్యాపీగా తినొచ్చు. అదే చిన్న పిల్లలకైతే రోజుకు ఒక గుడ్డు సరిపోతుంది. వేసవిలో గుడ్లు తినడం వల్ల బాడీ టెంపరేచర్ అసాధారణంగా పెరుగుతుందని చెప్పడానికి ఇప్పటివరకూ ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
నిజానికి గుడ్లు ఎండ వేడిని తట్టుకోవడానికి బాడీకి అవసరమైన శక్తిని ఇస్తాయి తప్ప హాని చేయవు. అయితే సమ్మర్‌లో మనం సాధారణంగానే తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటాం కాబట్టి, ఆకలిని బట్టి తక్కువ తీసుకోవడమే ఎప్పుడూ మంచిది.
అయితే గుడ్లు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గుడ్ల నాణ్యతతో పాటు అవి ఎంత తాజాగా ఉన్నాయనే విషయాన్ని గమనించుకోవాలి. వండే పద్ధతిలో కూడా జాగ్రత్త అవసరం. వేసవిలో ఆయిల్ ఎక్కువగా వేసి వేయించిన వాటి కంటే, చక్కగా ఉడకబెట్టిన గుడ్లను తీసుకోవడం చాలా మంచిది. సరైన పద్ధతిలో గుడ్డును తీసుకుంటే చలికాలమైనా, ఎండాకాలమైనా సరే మీ ఆరోగ్యానికి ఒక మంచి నేస్తంలా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
Harmanpreet Kaur : ఐదోసారి కెప్టెన్ గా హర్మన్ ప్రీత్..టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ఇదే
