Vitamin B-12 :విటమిన్ బి-12తో క్యాన్సర్ వస్తుందా? కొత్త పరిశోధనలో ఆ 2 షాకింగ్ నిజాలు

Vitamin B-12 : క్యాన్సర్ కణాలు చాలా తెలివిగా ఈ డెత్ ప్రాసెస్ నుంచి తప్పించుకోవడానికి విటమిన్ బి -12 ను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నట్లు రీసెర్చర్స్ చెబుతున్నారు.

Vitamin B-12

ఒంట్లో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే విటమిన్ లోపం ఏమోనని ..చాలామంది రకరకాల టాబ్లెట్లు, సప్లిమెంట్లు వాడేస్తుంటారు. ముఖ్యంగా విటమిన్ బి-12 మెదడుకు, నరాల శక్తికి ఎంతో అవసరమని అందరికీ తెలుసు.

అయితే, ఇటీవల విటమిన్ బి-12 (Vitamin B-12) తగ్గినా లేదా పెరిగినా క్యాన్సర్ వచ్చే ప్రమాదముందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. దీంతో అసలు ఈ కొత్త రీసెర్చ్ ఏం చెబుతోంది? నిజంగానే విటమిన్ బి-12 వల్ల క్యాన్సర్ వస్తుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి

ప్రసిద్ధ సైన్స్ జర్నల్ నేచర్ సెల్ బయోలజీ (Nature Cell Biology)లో పబ్లిష్ అయిన ఒక కొత్త పరిశోధన ప్రకారం.. విటమిన్ బి-12 (Vitamin B-12) అనేది క్యాన్సర్ కణాలు చనిపోకుండా, అవి మరింత కాలం బతికే ఉండేలా సాయపడుతోందని పరిశోధకులు గుర్తించారు.

మన శరీరంలో పాడైపోయిన , ముసలి కణాలను బాడీ స్వయంగా నాశనం చేసుకునే ఒక అద్భుతమైన నేచురల్ ప్రాసెస్ ఉంటుంది. దీనిని సైన్స్ భాషలో ఫెర్రోప్టోసిస్ అంటారు. అయితే, క్యాన్సర్ కణాలు చాలా తెలివిగా ఈ డెత్ ప్రాసెస్ నుంచి తప్పించుకోవడానికి విటమిన్ బి -12 ను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నట్లు రీసెర్చర్స్ చెబుతున్నారు.

దీని అర్థం విటమిన్ బి-12 ను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందనే భయం అక్కరలేదని తెలుసుకోవాలి. క్యాన్సర్ కణాలు తమను తాము కాపాడుకోవడానికి.. మన బాడీలో ఉండే విటమిన్ బి -12ని ఎలా వాడుకుంటున్నాయనేది మాత్రమే పరిశోధకులు కనుగొన్నారు.

ఇది ఇంకా ప్రారంభ దశలో ఉన్న పరిశోధన మాత్రమే. అయితే రోజూ తినే గుడ్లు, పాలు, మాంసం, ఆకుకూరలు, పప్పుధాన్యాల వంటి నేచురల్ ఫుడ్ ద్వారా దొరికే విటమిన్ బి-12 వల్ల ఎలాంటి క్యాన్సర్ రాదు. దీంతో ఆహారం విషయంలో ఎవరూ అస్సలు భయపడాల్సిన అవసరం లేదన్న విషయం గ్రహించాలి.

Vitamin B-12

అయితే మార్కెట్లో దొరికే విటమిన్ టాబ్లెట్ల గురించి క్యాన్సర్ నిపుణులు ఆందోళన పడుతున్నారు . డాక్టర్ల సలహా లేకుండానే చాలామంది సొంతంగానే మల్టీవిటమిన్ , విటమిన్-బి కాంప్లెక్స్ వంటి సప్లిమెంట్లను వాడేస్తున్నారు. ఇలా ఎక్కువ కాలం పాటు హై-డోస్ టాబ్లెట్లు తీసుకోవడం వల్ల.. అది క్యాన్సర్ తీవ్రతను పెంచే ప్రమాదముంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

కాగా ఈ కొత్త పరిశోధన క్యాన్సర్ కణాలను నాశనం చేసే సరికొత్త మెడిసిన్స్‌ను కనిపెట్టడానికి ఎంతగానో ఉపయోగపడనుంది. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విటమిన్ బి-12 టాబ్లెట్లు వాడకుండా ఉంటే చాలు ఎలాంటి టెన్షన్ అక్కరలేదు.

CM Vijay : జనంలోకి దళపతి..సీఎంగా తొలి పర్యటనకు సిద్ధం

Exit mobile version