Lemon
హెల్త్ విషయంలో మనమంతా ఒకరిని చూసి ఒకరు రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటాం. ఈ మధ్య కాలంలో వెయిట్ తగ్గడానికి చియా సీడ్స్, బ్లాక్ కాఫీ, అలాగే హలీమ్ గింజలలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారిపోయింది. అయితే, నిమ్మరసాన్ని డైరెక్టుగా నీళ్లతో కలిపి తాగడానికి, ఇలా వేరే పదార్థాలతో కలిపి తాగడానికి శరీర పరంగా చాలా తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
చియా సీడ్స్ , హలీమ్ గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టినప్పుడు అవి జెల్ అంటే జిగురులాంటి పదార్థాన్ని ఫామ్ చేస్తాయి. ఈ గింజల్లో ఫైబర్ , ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో నిమ్మరసం(Lemon Juice) కలిపి తాగినప్పుడు, ఆ గింజల్లోని జిగురు స్వభావం లెమన్‌లోని సిట్రిక్ యాసిడ్ యొక్క తీవ్రతను చాలావరకు తగ్గిస్తుంది.
దీనివల్ల లెమన్ జ్యూస్ పొట్ట లోపలి గోడలకు డైరెక్టుగా తగలకుండా ఈ గింజల జిగురు ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. కాబట్టి జీర్ణవ్యవస్థ బాగున్నవారు చియా సీడ్స్, హలీమ్ గింజలలో నిమ్మరసం కలిపి పరగడుపున తీసుకోవచ్చు.
కానీ, బ్లాక్ కాఫీ విషయం కొచ్చేసరికి ఈ కథ పూర్తిగా మారిపోతుంది. కాఫీలో నేచురల్‌గానే కెఫిన్ , అసిడిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు నిమ్మరసం(Lemon Juice)లోని సిట్రిక్ యాసిడ్‌ను కూడా కలిపితే, అది విపరీతమైన ఆమ్లత్వంతో (హైలీ అసిడిక్) తయారవుతుంది. అందుకే దీనిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు.
ఎందుకంటే ఇది పొట్టలో యాసిడ్ లెవెల్స్‌ను బాగా పెంచేసి తీవ్రమైన కడుపు మంట, చాతిలో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. బరువు తగ్గాలనే ఆరాటంలో బ్లాక్ కాఫీ-నిమ్మరసం కాంబినేషన్‌ను పరగడుపున తాగడం అస్సలు మంచి పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు.
ఇక హలీమ్ గింజల విషయానికి వస్తే, వీటిలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన బాడీ ఐరన్‌ను సరిగ్గా అబ్జార్బ్ చేసుకోవాలంటే విటమిన్ సి చాలా అవసరం పడుతుంది. అందుకే హలీమ్ గింజల నీళ్లలో నిమ్మరసం పిండుకుంటారు.
అయితే ఎవరికైనా అప్పటికే తీవ్రమైన అల్సర్లు, గ్యాస్ట్రైటిస్ , ఐబీఎస్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు ఉంటే మాత్రం.. అది చియా సీడ్స్ అయినా, హలీమ్ గింజలైనా సరే, ఉదయాన్నే పరగడుపున నిమ్మరసంతో కలిపి తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ ఏ ఇబ్బందీ లేనివారు ఈ గింజల డ్రింక్స్ తాగాలనుకుంటే, నిమ్మరసాన్ని(Lemon Juice) కేవలం కొన్ని చుక్కలు మాత్రమే లైట్‌గా వాడుకోవాలి.
Passport : 3 రోజుల్లోనే పాస్‌పోర్ట్..అప్లై చేయడానికి కావలసిన 4 ఈజీ స్టెప్స్ ఇవే
