Passport : 3 రోజుల్లోనే పాస్‌పోర్ట్..అప్లై చేయడానికి కావలసిన 4 ఈజీ స్టెప్స్ ఇవే
Passport : ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, క్యాస్ట్ సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్స్ ఉపయోగపడతాయి.
Passport
జీవితంలో ఎప్పుడు, ఎవరికి ఏ అవసరం వస్తుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా అర్జంట్‌గా ఫారిన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం చేతిలో.. పాస్‌పోర్ట్ లేకపోతే ఎంత ఇంపార్టెంట్ ప్రయాణమయినా క్యాన్సిల్ చేసుకోవడం తప్ప మరో మార్గం ఉండదు.
సాధారణంగా కొత్త పాస్‌పోర్ట్ (Passport) కోసం అప్లై చేసుకుంటే అది మన చేతికి రావడానికి వారాల సమయం పడుతుంది కాబట్టి, ఇలాంటి ఎమర్జెన్సీ సమయాల్లో జర్నీ ఆగిపోకుండా కేంద్ర ప్రభుత్వం తత్కాల్ స్కీమ్ రూపంలో ఒక సూపర్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ అదిరిపోయే స్కీమ్ ద్వారా కేవలం రెండు నుంచి మూడు రోజుల్లోనే పాస్‌పోర్ట్ డైరెక్టుగా మీ ఇంటికే వచ్చేస్తుంది. ఎందుకంటే నార్మల్ పద్ధతితో పోలిస్తే దీనిలో మీ పత్రాల పరిశీలన, ప్రింటింగ్‌తో పాటు కొరియర్ పంపే పనులను అధికారులు రాకెట్ స్పీడ్‌తో పూర్తి చేస్తారు. మీ దగ్గర ప్రభుత్వం అడిగిన సరైన సర్టిఫికెట్లు ఉంటే చాలు, ఈ ప్రాసెస్ చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది.
ఈ స్పీడ్ ప్రాసెస్ కోసం అప్లై చేసుకునేటప్పుడు మీ ఏజ్‌ను బట్టి కొన్ని ముఖ్యమైన ఐడెంటిటీ కార్డులను రెడీ చేసి పెట్టుకోవాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, క్యాస్ట్ సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్స్ దీనికి ఉపయోగపడతాయి.
ఒకవేళ దరఖాస్తుదారుడి వయసు 18 ఏళ్లు దాటితే.. ఈ లిస్ట్‌లో ఉన్న వాటిలో ఏవైనా మూడు ఒరిజినల్ డాక్యుమెంట్లు అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అదే 18 ఏళ్ల లోపు వయసున్నవారికి అయితే కేవలం రెండు డాక్యుమెంట్లు సమర్పిస్తే సరిపోతుంది.
అయితే ట్రైన్ టికెట్లలో తత్కాల్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నట్లే, ఈ ఎమర్జెన్సీ పాస్‌పోర్ట్ (Passport)కోసం కూడా సాధారణ ఫీజు కంటే రెండు వేల రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. మీరు తీసుకునే బుక్‌లెట్‌లో 36 పేజీలు లేక 60 పేజీలు అనే ఆప్షన్‌ను బట్టి ఈ ధర మారుతూ ఉంటుంది.
దీనికోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేయడం కూడా చాలా ఈజీ. మొదటగా పాస్‌పోర్ట్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ కనిపించే రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి ఒక కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత క్రియేట్ అయిన యూజర్ ఐడీ , పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి, కొత్త పాస్‌పోర్ట్ అప్లికేషన్ లింక్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. డిజిటల్ ఫామ్‌లో అడిగిన సమాచారాన్ని నింపిన తర్వాత, అప్లికేషన్ టైప్ అడిగే కాలమ్‌లో తత్కాల్ అనే ఆప్షన్‌ను మాత్రమే సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు కావాల్సిన పేజీల బుక్లెట్ ఆప్షన్ క్లిక్ చేసి ఫామ్ సబ్మిట్ చేయాలి.
తర్వాత స్టెప్‌లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ , యూపీఐ ద్వారా ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ పూర్తి చేయాలి. డబ్బులు చెల్లించిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంచుకుని, అపాయింట్మెంట్ స్లాట్‌ను బుక్ చేసుకోవాలి.
బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ ఉన్న స్లిప్‌ను ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏ మూడు డాక్యుమెంట్ల వివరాలు ఇచ్చారో, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లను, , వాటి జిరాక్స్ కాపీలను తీసుకుని కేటాయించిన టైమ్‌కు పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లాలి.
ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపు అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకుంటే.. ఆఫీసులో మీ పని చాలా త్వరగా ముగుస్తుంది. పాస్ పోర్ట్(Passport) ఆఫీసులో మీ బయోమెట్రిక్స్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతంగా ముగిసిన 48 నుంచి 72 గంటల్లోనే మీ కొత్త పాస్‌పోర్ట్ మీ ఇంటికి డెలివరీ అయిపోతుంది.
Cockroach Janta Party : భారత్ కు కాక్రోచ్ పార్టీ ఫౌండర్..జూన్ 6న ఏం జరగబోతోంది ?





