Dry Fruits
డ్రై ఫ్రూట్స్ , నట్స్ మన ఆరోగ్యానికి ఒక సూపర్ ఫుడ్ వంటివి అని డాక్టర్లు చెబుతుంటారు. కానీ వాటిని ఎప్పుడు, ఎలా తినాలో తెలియనప్పుడు పూర్తి ఫలితాలు రావు సరే కదా.. కొన్నిసార్లు గ్యాస్ లేదా అజీర్తి లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. అందుకే ఏ డ్రై ఫ్రూట్‌ని ఎలా తినాలో మొదట తెలుసుకుందాం.
బాదం పప్పులను ఎప్పుడూ కూడా నీళ్లలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే బాదం పైన ఉన్న తొక్క తీసి మాత్రమే తినాలి. ఎందుకంటే తొక్కలో ఉండే టానిన్ అనే పదార్ధం బాదంలో ఉన్న పోషకాలను మన బాడీ అబ్జార్బ్ చేసుకోకుండా అడ్డుకుంటుంది. రోజుకు ఐదు నుంచి ఎనిమిది బాదం పప్పులు ఉదయాన్నే పరగడుపున తింటే బ్రెయిన్ పవర్, ఎనర్జీ చాలా బాగుంటాయి.
అలాగే బ్రెయిన్‌కు చాలా మంచివని చెప్పే వాల్‌నట్స్‌ని కూడా నానబెట్టి తినడమే మంచిది. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే వేడి గుణం తగ్గిపోతుంది. రోజుకు రెండు వాల్‌నట్స్ తింటే గుండెకు, మెదడుకు చాలా మంచిది.
అంతేకాదు కిస్మిస్‌లను రాత్రంత నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగి, ఆ కిస్మిస్‌లను తినడం వల్ల రక్తం బాగా పడుతుంది . అలాగే లివర్ క్లీన్ అవుతుంది.
అంజీర్ కూడా రాత్రి నానబెట్టి ఉదయం తినాలి, కానీ ఖర్జూరాలను మాత్రం నార్మల్‌గా తినేయవచ్చు.రోజుకు ఒకటి లేదా రెండు అంజీర్, రెండు ఖర్జూరాలను ఒకేసారి తింటే ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. మలబద్ధకం పోతుంది.
ఇక పిస్తా, జీడిపప్పులను నానబెట్టి తినాల్సిన అవసరం లేదు. సాయంత్రం స్నాక్స్ టైమ్‌లో అంటే 4 నుంచి 5 గంటల మధ్య వీటిని కొద్దిగా తింటే నీరసం రాకుండా ఉంటుంది. అయితే వీటికి ఉప్పు లేకుండా చూసుకోవడం ముఖ్యం.
కొన్ని డ్రై ఫ్రూట్స్, నట్స్ కలిపి తింటే వాటి పవర్ డబుల్ అవుతుంది. ఉదయాన్నే నానబెట్టిన బాదం, వాల్‌నట్స్, కిస్మిస్‌లను కలిపి హ్యాపీగా తినొచ్చు. ఇది బాడీకి కంప్లీట్ ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది.
అలాగే ఖర్జూరం మధ్యలో గింజ తీసేసి, అందులో నానబెట్టిన బాదం పప్పు పెట్టుకుని తింటే టేస్ట్ అదిరిపోవడమే కాదు స్టామినా కూడా పెరుగుతుంది.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని మిల్క్‌లో అంజీర్ ముక్కలను వేసుకుని తింటే.. పాలు తాగితే నిద్ర చాలా బాగా పడుతుంది.
గుమ్మడి గింజలని నార్మల్‌గా డ్రై రోస్ట్ చేసుకుని అంటే నూనె లేకుండా పెనం మీద దోరగా వేయించుకుని తినడం చాలా మంచిది. రోస్టింగ్ చేయడం వల్ల గింజలు క్రిస్పీగా మారడమే కాకుండా ఈజీగా డైజెస్ట్ అవుతాయి.
రోజుకు ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలను తింటే సరిపోతుంది. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత లేదా సాయంత్రం స్నాక్స్ టైమ్‌లో తినవచ్చు. ఇవి బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి , జుట్టు రాలడాన్ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతాయి.
ఇక సన్‌ఫ్లవర్ అంటే ప్రొద్దుతిరుగుడు గింజలు, పుచ్చకాయ గింజలను కూడా లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకుని తినడమే మంచిది. అయితే ఈ గుమ్మడి, సన్‌ఫ్లవర్, పుచ్చకాయ గింజలను విడివిడిగా తినడం కంటే, మూడింటిని సమానంగా కలిపి లైట్‌గా వేయించి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మంచిది. వీటిని సాయంత్రం పూట తినొచ్చు. తినే బ్రేక్‌ఫాస్ట్ ఓట్స్, ఉప్మా, లేదా ఫ్రూట్ సలాడ్స్ పైన కాస్త చల్లుకుని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది.
అలాగే వీటిని కూడా డ్రై ఫ్రూట్స్ లాగే రాత్రి నీళ్లలో నానబెట్టి మార్నింగ్ తినొచ్చు. ఎవరికైనా కడుపులో విపరీతమైన వేడి లేదా అజీర్తి సమస్యలుంటే, రోస్ట్ చేసిన వాటికంటే నానబెట్టిన గింజలు తినడమే మంచిది. ఒకేసారి గుప్పెడు తినకుండా రోజుకు ఒకటి నుంచి రెండు చెంచాల మోతాదులో మాత్రమే తీసుకుంటే వీటికున్న పూర్తి హెల్త్ బెనిఫిట్స్ బాడీకి అందుతాయి.
అన్ని కలిపిన డ్రై ఫ్రూట్స్(Dry Fruits) లడ్డూ చాలా హెల్దీ. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. కేవలం ఖర్జూరం పేస్ట్ లేదా అంజీర్ పేస్ట్‌ని జిగురు లాగా వాడుకుని లడ్డూలు చుట్టుకోవాలి. అలాగే ఈ లడ్డూ హెవీగా ఉంటుంది కాబట్టి రోజుకు ఒక్క చిన్న లడ్డూ మాత్రమే తినాలి. అయితే మలబద్ధకం, కడుపు ఉబ్బరం ఉన్నవాళ్లు ఈ లడ్డూని తినడం కంటే విడివిడిగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడమే మంచిది.
చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, డ్రై ఫ్రూట్స్(Dry Fruits) ఆరోగ్యానికి మంచివే కదా అని గుప్పిళ్లు గుప్పిళ్లు తినకూడదు. అలా తింటే బాడీలో వేడి పెరిగిపోతుంది. రోజు మొత్తంలో అన్ని డ్రై ఫ్రూట్స్(Dry Fruits) కలిపి గుప్పెడు మించకూడదు. ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్(Dry Fruits) క్వాంటిటీని కాస్త తగ్గించి, నానబెట్టిన వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బెటర్. చలికాలం, వర్షాకాలంలో మాత్రం నార్మల్‌గా తినేయొచ్చు.
Legal Notice : మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఎంపీ కొడుకు వార్నింగ్
