Elder people : వృద్ధులను బెడ్‌కే పరిమితం చేయొద్దు.. ఈ అతి జాగ్రత్తే వారికి ప్రాణాంతకం కావొచ్చు

Elder people : వయసు పైబడిన వారికి మంచం మీద పడుకోవడం హాయిగా అనిపించొచ్చు. కానీ ఒకసారి పడుకున్నాక వారు మళ్లీ లేచి నిలబడటం చాలా కష్టం.

Elder people

ఎవరికైనా కాస్త ఏజ్ వచ్చాక వారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే.. బాగా విశ్రాంతి తీసుకోండి.. ఎక్కువగా తిరగకండి అని వాళ్ల ఇంట్లో వాళ్లు, చుట్టుపక్కల చెబుతుంటారు. నిజానికి అక్కడే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి మొదలవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఓల్డ్ ఏజ్‌లో(Elder people) ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చినపుడో లేదా సర్జరీ జరిగినప్పుడో, మనం వారిపై చూపించే విపరీతమైన ప్రేమే ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు తెస్తుందట. నడవలేక ఇబ్బంది పడతారనో కింద పడిపోతారనో భయంతో చాలా మంది వారిని కదలకుండా మంచం మీదనే పూర్తి విశ్రాంతి తీసుకోమని చెప్తారు. కానీ, ఇలా ఎక్కువ రోజులు కదలకుండా బెడ్ రెస్ట్ ఇవ్వడం అనేది విశ్రాంతి కాదు, శరీరం దెబ్బతినడానికి ఆరంభమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే వయసు పైబడిన వారికి మంచం మీద పడుకోవడం హాయిగా అనిపించొచ్చు. కానీ ఒకసారి పడుకున్నాక వారు మళ్లీ లేచి నిలబడటం చాలా కష్టం. చాలా సందర్భాల్లో వచ్చిన అనారోగ్య సమస్యల వల్ల కంటే, కదలిక లేకుండా అలా మంచానికే పరిమితం కావడం వల్లే ప్రాణాలు కోల్పోతుంటారు.

సర్జరీ లేదా హెల్త్ ఇష్యూస్ వచ్చిన మొదటి 72 గంటలు అంటే మూడు రోజులు వీరికి అత్యంత కీలకం. ఆ టైంలోనే డాక్టర్ల సలహాతో వాకర్ సహాయంతోనో లేదా పక్కన ఎవరో ఒకరు ఉండి చిన్నగా నడిపించాలి. అలా కాకుండా బెడ్‌కే పరిమితం చేస్తే, అసలు వ్యాధి కంటే కూడా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

ఎక్కువ రోజులు కదలకుండా పడుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని నిమోనియా రావడం, రక్తంలో గడ్డలు ఏర్పడటం, ఒళ్లంతా బెడ్ సోర్స్ అంటే పడక పుండ్లు పడటం, నరాలపై ఒత్తిడి పడి రక్తప్రసరణ నిలిచిపోవడంతో తర్వాత నడవాలన్నా నడవలేని పరిస్థితులలోకి వెళ్లడం లాంటివి వచ్చే ప్రమాదం ఉంది.

శరీరంలో కదలికలు లేకపోతే వారానికి కొంత శాతం చొప్పున కండరాల బలం మెల్లగా తగ్గిపోతుంది. చివరికి కండరాలు పూర్తిగా క్షీణించిపోయి, కాలు చేతులు కూడా మొద్దుబారిపోతాయి. పేషెంట్ చేయాల్సిన ప్రతి చిన్న పనిని మనమే చేసి పెట్టడం వల్ల వారిని మెంటల్‌గా, ఫిజికల్‌గా మరింత అశక్తులుగా మార్చినట్లవుతుంది.

Elder people

పెద్దలకు(Elder people) మనం చేసే నిజమైన సేవ ఏంటంటే.. వారి పనులను వారే చేసుకునేలా చేస్తూ మళ్లీ సొంత కాళ్లపై నిలబెట్టడమే. దీని కోసం చిన్నచిన్నగా వ్యాయామాలు చేయించాలి. అలా ఎక్స్‌ర్‌సైజులు చేయించేటప్పుడు వారు కొద్దిగా నొప్పితో ఇబ్బంది పడినా సరే.. మరో 30 సెకన్లు అయినా ఓపిక పట్టమని వారిని ప్రోత్సహించాలి.

ఒకటే గుర్తుపెట్టుకోవాలి..తీవ్రమైన జబ్బుల కంటే, విశ్రాంతి తీసుకోమనే మన ఒక్క మాటే ఓల్డ్ ఏజ్‌లో(Elder people) ఉన్నవారికి, సర్జరీలు జరిగినవారికి కోలుకోవాలనే సంకల్పాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మన ఇంట్లో వారికి అలాంటి పరిస్థితి వస్తే, వారిని మంచానికే పరిమితం చేయకుండా మనం పక్కన ఉండి నడిపించడానికి ప్రయత్నించాలి. వృద్ధాప్యంలో ఎవరి సాయం లేకుండా సొంతంగా నడవగలగడం కంటే అపురూపమైన స్వేచ్ఛ ఎవరికీ మరొకటి లేనే లేదు. అందుకే ఆ స్వేచ్ఛను వారికి అందించడానికి ప్రతీ ఒక్కరూ చూడాలి.

No Marriage : సోలో బతుకే సో బెటర్ .. పెళ్లికి నో అంటున్న యూత్

Exit mobile version