Ginger
కిచెన్‌లో ప్రతిరోజూ వంటల రుచిని పెంచడానికి వాడే ఒక చిన్న అల్లం ముక్కలో కొన్ని వందల మెడికల్ వాల్యూస్ ఉన్నాయన్న విషయం తెలిస్తే ఎవరూ కూడా అస్సలు వదిలిపెట్టరు. కేవలం అల్లాన్ని మసాలా దినుసుగానే కాకుండా, ఆయుర్వేదంలో ఒక పవర్‌ఫుల్ మెడిసిన్ హోదా కూడా ఉందన్న సంగతి కూడా చాలామందికి తెలీదు.
జీర్ణవ్యవస్థను సరైన ట్రాక్‌లో పెట్టడం నుంచి, కడుపులోని చెడు బ్యాక్టీరియాను ఏరిపారేయడం వరకు జింజర్ చేసే మేలు అంతా ఇంతా కాదు. గర్భిణుల్లో వచ్చే వికారం, వాంతులు, అలాగే సాధారణ జ్వరం నుంచి వెంటనే రిలీఫ్ ఇవ్వడంలో అల్లం ది బెస్ట్‌గా చెబుతారు.
శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచి గుండెకు కొండంత అభయాన్ని ఇవ్వడంలో అల్లం దిట్ట. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకోవడంతో పాటు, సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌ను యాక్టివ్ చేయడం అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ సరిగ్గా పనిచేసేలా చేయడంలోనూ అల్లం రోల్ ఉంటుంది.
ఆకలి కావడం లేదని అనుకునేవారు అల్లం, ధనియాలను కలిపి నూరి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. పైత్యం ఎక్కువయి వికారంగా అనిపిస్తే అల్లం ముక్కలను తేనెలో నానబెట్టి పరగడుపున తింటే వెంటనే రిలాక్సేషన్ వస్తుంది.
అంతేకాదు జాయింట్ పెయిన్స్ , వెయిట్ లాస్ విషయంలో కూడా అల్లం హీరోలా పనిచేస్తుంది. బెల్లం, అల్లం రసం కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఒక గ్లాసు మజ్జిగలో తురిమిన అల్లం వేసుకుని డైలీ తాగుతూ ఉంటే పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వు మెల్లగా కరిగిపోతుంది.
తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం(Ginger) పేస్ట్‌ను నుదిటిపై పట్టులా వేస్తే ఫలితం ఉంటుంది. కడుపుబ్బరంగా అనిపిస్తే నీళ్లలో అల్లం వేసి మరిగించి, ఆ నీటిలో తేనె కలిపి తాగితే ఇన్‌స్టెంట్ రిలీఫ్ వస్తుంది. తేనెలో నానబెట్టిన అల్లంను రెగ్యులర్‌గా తింటే చర్మంపై ముడతలు తగ్గి గ్లో పెరుగుతుంది.
అలాగే పీరియడ్స్ టైమ్‌లో మహిళలకు వచ్చే భరించలేని పొత్తికడుపు నొప్పికి.. జింజర్ కషాయం ఒక వండర్ మెడిసిన్. అల్లం వేసిన నీటిని బాగా మరిగించి ఆ వాటర్‌లో అరటిపండు తొక్కను కలిపి రోజుకి రెండుసార్లు చొప్పున తాగితే నొప్పి మాయమయిపోతుంది.
Lingamneni Sanjush : ఆరోజు జరిగింది ఇదే.. హిట్ అండ్ రన్ ప్రచారంపై ఎంపీ రమేష్ కుమారుడు క్లారిటీ..
