Gond Katira: గోండు కటిర పేరు విన్నారా? సమ్మర్‌లో అస్సలు మిస్ అవకండి..

Gond Katira: ఇది కేవలం శరీరానికి చలువ చేయడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు.

Gond Katira

ఎండలు మండిపోతుండటంతో చాలామంది ఉక్కపోత, వేడితో ఇబ్బంది పడుతున్నారు. అయితే సమ్మర్‌ వేడి నుంచి తప్పించుకోవడానికి మన పూర్వీకులు కొన్ని చిట్కాలు వాడేవారు. అలాంటి వాటిలో గోండు కటిర(Gond Katira) చాలా ముఖ్యమయినది. అయితే దీని గురించి చాలామందికి తెలియదు. కానీ తెలిస్తే మాత్రం దీనిని అస్సలు మిస్ చేయరు.

గోండు కటిరలో సహజ సిద్ధమైన జిగురు ఉంటుంది. దీనిలో ప్రోటీన్, కాల్షియం ,మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం శరీరానికి చలువ చేయడమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను అందిస్తుందని వివరిస్తున్నారు.

శరీరాన్ని చల్లబరచడంలో, ముఖ్యంగా సమ్మర్‌లో బాడీని కూల్ చేయడానికి దీనికి మించినది లేదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఎండల వల్ల ఎదురయ్యే వడదెబ్బ, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలకు ఇది చాలా మంచి పరిష్కారం అంటున్నారు.

నీటిలో నానబెట్టినప్పుడు గోండు కటిర(Gond Katira) జెల్లీలా మారుతుంది. దీనిని వాటర్, నిమ్మరసంతో కానీ పాలలో కలుపుకొని కానీ తాగడం వల్ల శరీరం లోపల ఉన్న వేడి తగ్గిపోయి చల్లగా ఉంటుంది. అంతేకాదు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గుతుంది. భోజనం తర్వాత దీనిని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.

Gond Katira

కేవలం హెల్త్ కోసమే కాకుండా అందానికి కూడా ఇది యూజ్ అవుతుందట. దీనిలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు స్కిన్‌పై ముడతలు పడకుండా చేసి, చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయట. అందుకే చాలామంది దీనిని రోజ్ వాటర్ తో కలిపి ఫేస్ ప్యాక్ లా కూడా వాడుతుంటారు. వెయిట్ తగ్గాలనుకునే వారు కూడా దీనిని తమ డైట్‌లో చేర్చుకోవచ్చు.

గోండు కటిర బాడీలో మెటబాలిజంను పెంచి, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేయడంలో ది బెస్ట్ అంటారు. అలాగే కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి శక్తిని ఇవ్వడానికి, వారిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఈ గోండు కటిరను ఇస్తుంటారు.

దీనిని ఎలా తీసుకోవాలంటే..ఒక చెంచా గోండు కటిరను రాత్రంతా ఒక గ్లాసుడు నీటిలో నానబెట్టాలి. ఉదయానికి అది తెల్లటి జెల్లీగా మారుతుంది. ఆ జెల్లీని నీటిలోనో, పాలల్లోనో, లేక షర్బత్ లోనో కలుపుకొని తాగితే సరిపోతుంది.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version