Ice Apple : పసందైన తాటి ముంజలు..ఉపయోగాలు ఎన్నెన్నో

Ice Apple : వేసవిలో దొరికే కొన్ని సీజనల్ పండ్లకు ఉండ్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా దొరికే మామిడి మాత్రమే కాదు సమ్మర్ లో అందరూ పసందుగా లాగించేవి తాటి ముంజలు

Ice Apple

వేసవిలో దొరికే కొన్ని సీజనల్ పండ్లకు ఉండ్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా దొరికే మామిడి మాత్రమే కాదు సమ్మర్ లో అందరూ పసందుగా లాగించేవి తాటి ముంజలు(Ice Apple). వీటికి డిమాండ్ కూడా ఎక్కువే. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. వీటి లోపలి భాగంలో ఉండే నీరు వల్ల శరీరానికి చలువ చేస్తుంది. దీనిని ఐస్ యాపిల్(Ice Apple) గా కూడా పిలుస్తారు. నీటిశాతం ఎక్కువగా ఉండడం, తియ్యగా రుచిగా ఉండడంతో ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు.

ఇవి తినడం వల్ల ఉండే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకు కనిపిస్తాయి. ఏప్రిల్ ఆరంభం నుంచి మే చివరి వరకు తాటి ముంజలు మనకు పుష్కలంగా దొరుకుతాయి. ఎలాంటి కల్తీలేని పకృతి సిద్ధమైన ఫలం కావడం దీని ప్రత్యేకత.

ముఖ్యంగా వేసవిలో వచ్చే డీ హైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. తాటి ముంజల్లో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం ఉంటాయి.చాలా మంది శరీరానికి అవసరమైనంత నీరు తాగలేకపోతున్నారు. ఈ కారణంగానే కిడ్నీల్లో రాళ్ల వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్య ఉన్నవారికి తాటిముంజలు అద్భుతమైన ఔషధంగా చెప్పొచ్చు. తాటి ముంజలతో బరువుకు చెక్ పెట్టొచ్చు.

Ice Apple

శరీర బరువు తగ్గటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే కడుపులో మంట, మూత్ర విసర్జన సమయంలో భరించలేని నొప్పి నుంచి ఉపశమనానికి కూడా లేత ముంజలు అసలైన ముందు. 15 రోజుల పాటు వీటిని తీసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి. తాటి ముంజలతో కాలేయ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు.

వీటిలో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే చెడు పదార్థాలను నిర్మూలిస్తుంది. అలాగే తాటి ముంజలు శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చి అలసటను తగ్గిస్తాయి. ఎండాకాలంలో వేడి చేసి ఇబ్బంది పడే వారు తాటి ముంజలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. అలాగే చర్మ సమస్యలను నివారించడంలో తాటి ముంజలు సహాయపడుతాయి. వేసవిలో వచ్చే వేడి దద్దుర్లు, మొటిమలను నయం చేయడంలో దోహదపడతాయి.

Kohli : ఇదిరా కింగ్ కోహ్లీ అంటే..చిన్నస్వామిలో కళాత్మక విధ్వంసం

Exit mobile version