Moringa Powder : ప్రకృతి ప్రసాదించిన న్యూట్రిషన్ పవర్‌హౌస్ ..సూపర్ ఫుడ్‌గా మునగాకుల పొడి

Moringa Powder : తాజా మునగ ఆకులతో పోలిస్తే, ఎండబెట్టిన మునగాకు పొడిలో పోషకాల సాంద్రత మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు తేల్చాయి.

Moringa Powder

ఎంతో నేచురల్‌గా పెరిగే మునగ చెట్టును పోషకాహార నిపుణులు అద్భుత వృక్షం అని పిలుస్తారు. అలాగే కూరల్లో వాడే మునగాకులను బాగా కడిగి, నీడన ఎండబెట్టి తయారు చేసే మునగాకు పొడి లేదా మోరింగా పౌడర్(Moringa Powder) బాడీకి కావలసిన సంపూర్ణ పోషణను అందించే ఒక అద్భుతమైన సహజ ఆహారంగా చెబుతారు.

తాజా మునగ ఆకులతో పోలిస్తే, ఎండబెట్టిన మునగాకు పొడిలో పోషకాల సాంద్రత మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. దీనిలో విటమిన్ -ఎ, విటమిన్- సి, విటమిన్- ఇ తో పాటు బాడీకి అవసరమైన కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి.

మన డైలీ ఆహారంలో కేవలం ఒక చిన్న చెంచా మునగాకు పొడిని చేర్చుకుంటే చాలు ..దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. దీనిని పప్పు, కూరలు, సూప్‌లు, చపాతీ పిండి లేదా మార్నింగ్ స్మూతీలలో సులువుగా కలుపుకొని తీసుకోవచ్చు.

మునగాకు శరీరంలో శక్తిని పెంచడంతో పాటు.. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాలుష్యం, ఒత్తిడి నుంచి రక్షించడంలో కూడా కీలక పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను హెల్దీగా ఉంచడానికి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

Moringa Powder

అయితే మునగాకు పొడి(Moringa Powder)ని ఒక పోషకాహారంగా మాత్రమే చూడాలి. మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలున్నవారు తమ మందులకు ప్రత్యామ్నాయంగా దీనిని వాడుతుంటారు. అలా కాకుండా, రోజూ తినే సమతుల ఆహారంలో ఒక భాగంగా మాత్రమే మునగాకును తీసుకోవాలి.

ఏ రకమైన ఆహారమైనా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మునగాకు పొడిని కూడా సరైన మోతాదులో తీసుకోవడం మంచిది. ఈ పొడిని ఎక్కువగా తీసుకుంటే కొందరిలో కడుపు ఉబ్బరం లేదా జీర్ణసంబంధమైన చిన్నపాటి అసౌకర్యాలు కలగొచ్చు. క్వాలిటీ ఉన్న మునగాకు పొడి(Moringa Powder)ని ఎంచుకుని డైలీ వాడితే.. శారీరక ఆరోగ్యం మెరుగుపర్చడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.

Allu Arjun : ఇకపై 6 నెలలకోసారి బన్నీ ఫ్యాన్ మీట్..ఐకాన్ స్టార్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ

Exit mobile version