Nail Changes
మన చేతులను చూసుకున్నప్పుడు ఒక్కోసారి నెయిల్స్ వెరైటీగా కనిపిస్తుంటాయి. గోరు పైకి లేవడం, కలర్ మారడం వంటివి చూసి పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తుంటాము. అయితే మన బాడీ లోపల ఏ అనారోగ్యం మొగ్గ తొడుగుతున్నా, దాని ఫస్ట్ సింప్టమ్ను మన గోళ్లే బయటపెడతాయని నిపుణులు అంటున్నారు. చర్మ సమస్యల నుంచి థైరాయిడ్, ఐరన్ లోపం.. చివరికి హార్ట్, లంగ్స్ కి సంబంధించిన సీరియస్ ఇష్యూస్ వరకు మన నెయిల్స్ రూపంలో బాడీ అలర్ట్స్ పంపుతుందట.
చాలామంది నెయిల్స్(Nail Changes) మీద చిన్న వైట్ మచ్చలు కనిపించగానే శరీరంలో కాల్షియం తగ్గిపోయిందేమో టెన్షన్ పడుతుంటారు. కానీ నిజానికి అది గోరు పెరిగే రూట్ దగ్గర చిన్న గాయమవ్వడం వల్ల వచ్చే మచ్చ మాత్రమే. గోళ్లను కొరకడం, మేనిక్యూర్ చేసేటప్పుడు క్యూటికల్స్‌ను గట్టిగా వెనక్కి నెట్టడం,లాంగ్ టైమ్ నెయిల్ పాలిష్ వాడటం వల్ల గోళ్లు డ్రై అయిపోయి ఈ మార్క్స్ పడతాయి.అయితే ఇవి గోరు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్‌గా పోతాయి.
అంతకు ముందు వరకూ బాగా ఉన్న గోళ్లు ఉన్నట్టుండి విరిగిపోతూ పెళుసుగా మారితే మాత్రం ఆలోచించాలి. ఏజ్ పెరిగే కొద్దీ ఈ చేంజెన్స్ రావడం సాధారణమే అయినా.. ఉన్నట్టుండి శరీరం చలి పెరిగినట్లు అన్పించడం, మలబద్ధకం వంటి సమస్యలతో పాటు గోళ్లు పెళుసుగా మారితే అది థైరాయిడ్ లక్షణం కావొచ్చు.
ఇక కొందరికి నెయిల్ కింద స్కిన్ నుంచి వేరై పైకి లేచినట్లు కనిపిస్తుంది, దీనినే మెడికల్ టర్మ్‌లో ఆనికానాలసిస్ (Onycholysis) అంటారు. ఎక్కువ ఆక్రలిక్ లేదా జెల్ మేనిక్యూర్స్ చేయించుకోవడం, వాటర్‌లో చేతులు ఎక్కువగా ఉంచడం వల్ల గోరు కింద ఖాళీ ఏర్పడి బ్యాక్టీరియా, ఈస్ట్ ఫంగస్ చేరి ఇలా అవుతుంది. అయితే తరచుగా ఇలా అయితే మాత్రం నెయిల్ సోరియాసిస్ ఉందేమో డాక్టర్‌తో చెక్ చేయించుకోవాలి.
అలాగే నెయిల్స్ పైనుంచి కిందకి నిలువు లైన్స్ కనిపించడం ఏజ్ పెరుగుతుందని చెప్పడం అన్నమాట. కణాలు సరిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల వచ్చే ఈ లైన్స్ నెయిల్స్ డ్రై అవ్వకుండా తేమగా ఉంచితే తగ్గుతాయి.
గోరు మధ్యలో గుంట పడి చెంచా ఆకారం(స్పూన్ నెయిల్స్)లోకి మారితే దానిని కొయిలోనికియా అంటారు. ఇది తీవ్రమైన ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతకు సిగ్నల్. కొన్నిసార్లు ఎగ్జిమా, సోరియాసిస్ లేదా కాలేయం, గుండె సమస్యల్లో కూడా ఇది కనిపిస్తుంది.
అలాగే గోళ్లపై సూదితో గుచ్చినట్లు చిన్న చిన్న గుంటలు పడితే అది నెయిల్ సోరియాసిస్ లేదా అలోపేషియా ఏరియాటా వల్ల కావొచ్చు. ఇక అన్నిటి కంటే భయపడాల్సిన మార్పు క్లబ్బింగ్. గోరు(Nail Changes) వెనుక ఉబ్బి గుండ్రంగా మారుతుంది. ఇది లంగ్స్, హార్ట్‌కు సంబంధించిన ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది.
