KTR : కేటీఆర్‌కు రిలీఫ్.. పాస్‌పోర్ట్ జప్తు వ్యవహారంలో ఏసీబీ చర్యలపై హైకోర్ట్ క్లాస్

KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

KTR

తెలంగాణ పాలిటిక్స్‌లో కొన్నాళ్లుగా హాట్ టాపిక్‌గా మారిన ఫార్ములా ఈ-రేస్ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) పాస్‌పోర్ట్ చెల్లుబాటును ఆపేయాలని చూసిన ఏసీబీ వర్గాలకు తెలంగాణ హైకోర్ట్ ఊహించని షాకిచ్చింది.

కేటీఆర్‌(KTR)కు పాస్‌పోర్ట్ రీజినల్ ఆఫీస్ జారీ చేసిన షోకాజ్ నోటీసులతో పాటు అభ్యంతరకర ప్రొసీడింగ్స్‌పై నవంబర్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా యథాతథ స్థితి (స్టేటస్ కో) ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు కేటీఆర్‌కు పెద్ద న్యాయపరమైన ప్రొటెక్షన్ లభించినట్లు అయింది. అలాగే ఇదే సమయంలో కేంద్ర విదేశాంగ శాఖతో పాటు ఏసీబీ ఉన్నతాధికారులకు కూడా కౌంటర్ పిటిషన్లను దాఖలు చేయాలంటూ హైకోర్ట్ న్యాయమూర్తి విస్పష్ట నోటీసులు పంపారు.

అసలు ఈ న్యాయపోరాటం ఎక్కడి వరకూ వచ్చిందనే విషయాన్ని ఓసారి చూస్తే.. సెప్టెంబర్ చివరి వారంలో పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి అందిన నోటీసులతో పాటు, ఆ తర్వాత అక్టోబర్‌లో వచ్చిన జప్తు జీవోను సవాల్ చేస్తూ కేటీఆర్ పిటిషన్ వేయడంతో మంగళవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వేడివేడిగా విచారణ సాగింది.

ఈ వ్యవహారంలో ఏసీబీ ఇప్పటికే ఛార్జ్‌షీట్ కంప్లీట్ చేసిందని, విచారణకు కేటీఆర్ ఏరోజూ కూడా అడ్డంకిగా మారలేదని కేటీఆర్ లాయర్లు కోర్టు ముందు బలమైన పాయింట్ లేవనెత్తారు. అటువంటప్పుడు కేవలం ఒక ఏజెన్సీ లెటర్‌ను పట్టుకుని ఓ ప్రజాప్రతినిధి ప్రాథమిక హక్కులను కాలరాసేలా పాస్‌పోర్ట్ జప్తునకు పూనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తమ వాదనలు వినిపించారు.

ఈ వాదనలు విన్న జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్, ఏసీబీ అధికారుల వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. అసలు విచారణ కోర్టు పరిధిలో నడుస్తున్నప్పుడు, కోర్టు అనుమతి లేకుండానే విచారణ సంస్థలు సొంతంగా పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు లెటర్స్ ఎలా రాస్తాయని నిలదీశారు. దీనికి ఏసీబీ న్యాయవాదులు తమ నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి మెమోల ప్రస్తావన తెచ్చినా కూడా, కోర్టు మాత్రం ఆ వాదనలను తోసిపుచ్చింది. నోటీసుల ప్రాసెస్‌పై ప్రస్తుతానికి కఠినమైన బ్రేకులు వేస్తూ నవంబర్ 6వ తేదీ వరకు స్టే విధించడంతో.. అధికార పక్షం విసిరిన వ్యూహానికి కొద్ది రోజులు చెక్ పడినట్లయింది.

Atlataddi : మొదలైన అట్లతద్ది సందడి..పెరుగన్నం నుంచి 11 అట్ల వాయనం వెనుక ఉన్న అసలు రహస్యం

↑
Exit mobile version