Roses
గులాబీ పువ్వులంటే కేవలం అందానికి, సువాసనకే పరిమితం కాదు.. అవొక అద్భుతమైన ఆరోగ్య నిధిగా చెబుతారు నిపుణులు. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో బాడీని కూల్ చేసే సహజ సిద్ధమైన ఔషధంగా గులాబీలు పనిచేస్తాయి. నిద్రలేమి నుంచి చర్మ సౌందర్యం వరకు గులాబీ(Roses) చేసే మేలు అంతా ఇంతా కాదు.
ఆయుర్వేదం ప్రకారం గులాబీ రేకులకు బాడీని కూల్ చేసే గుణం ఉంటుంది. వేసవిలో కనిపించే అతిగా దాహం వేయడం, నోటి పూత, మంట వంటి సమస్యలకు గులాబీ రేకులతో చేసే గుల్కంద్ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అంటారు నిపుణులు. రోజుకు ఒక స్పూన్ గుల్కంద్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం , ఎసిడిటీ వంటి సమస్యలన్నీ మాయమవుతాయి. ఇది కడుపును లోపలి నుంచి శుభ్రపరిచి ఆకలిని కూడా పెంచుతుంది.
ఇక చర్మపు సౌందర్యం విషయానికి వస్తే, రోజ్ వాటర్ ఒక బెస్ట్ నేచురల్ టోనర్‌గా పనిచేస్తుంది. ముఖంపైన, చేతులపైన పేరుకుపోయిన దుమ్మును తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కంప్యూటర్లు, మొబైల్స్ వాడటం వల్ల కళ్లలో వచ్చే మంటలను తగ్గించడానికి కళ్లపై రోజ్ వాటర్‌లో ముంచిన దూదిని ఒక పది నిమిషాలు ఉంచుకుంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇది కళ్లకు చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.
ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందిని కామన్‌గా వేధిస్తున్న సమస్య ..స్ట్రెస్. ఇలాంటి వాళ్లకు గులాబీల(Roses) సువాసన మంచిది. ఇది మనసును ప్రశాంతపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు గులాబీ టీ తాగడం వల్ల కూడా నిద్రలేమి సమస్య తొలగిపోయి గాఢమైన నిద్ర పడుతుంది.
అంతేకాదు మహిళలకు నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి, నీరసాన్ని తగ్గించడంలోనూ గులాబీలు(Roses) కీలక పాత్రను పోషిస్తాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేసి బాడీలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపుతాయి.
హెయిర్ ప్రొటెక్షన్‌లో కూడా రోజ్ వాటర్ చాలా బాగా పని చేస్తుంది. తలపై చెమట వల్ల వచ్చే దురదను తగ్గించడంతో పాటు జుట్టు మెరిసేలా చేస్తుంది. అయితే వీటిని ఏ రూపంలో వాడినా సరే.. కెమికల్స్ లేని స్వచ్ఛమైన గులాబీ ప్రొడెక్ట్స్‌నే ఎంచుకోవాలని గుర్తుంచుకోవాలి.
Kolkata Knight Riders : శతక్కొట్టిన అలెన్..కోల్ కతాకు మరో విజయం
