Kolkata Knight Riders : శతక్కొట్టిన అలెన్..కోల్ కతాకు మరో విజయం
Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్ తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది
Kolkata Knight Riders
ఐపీఎల్ సెకండాఫ్ లో కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) దుమ్మురేపుతోంది. ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమైన కేకేఆర్ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు నిస్సాంక, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.
తొలి వికెట్ కు ఐదు ఓవర్లలోనే 49 పరుగులు జోడించారు. రాహుల్ 14 బంతుల్లో 23 ( 4 ఫోర్లు ) ఔటైన కాసేపటికే నితీశ్ రాణా(8) కూడా వెనుదిరిగాడు. ఇక్కడ నుంచీ ఢిల్లీ బ్యాటర్లు సింగిల్స్ తీసేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. కోల్ కతా బౌలర్లు అంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. నిస్సాంక 29 బంతుల్లో 50 (5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటైన తర్వాత ఢిల్లీ స్కోరు మరింత డీలా పడింది. పరుగులు రాకపోవడంతో భారీ షాట్లకు ప్రయత్నిస్తూ కీలక బ్యాటర్లంతా ఔటయ్యారు. రిజ్వీ (3), స్టబ్స్ (2) పరుగులకే వెనుదిరిగారు.
ఈ దశలో అక్షర్ పటేల్ , అశుతోశ్ శర్మ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ ఆరో వికెట్ కు 39 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్ కనీసం సింగిల్స్ తీసేందుకు కూడా చాలా కష్టపడ్డాడు. మరోవైపు అశుతోష్ శర్మ ధాటిగా ఆడాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. చివర్లో సైతం కోల్ కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కట్టడి చేశారు. ఆఖరి ఓవర్లో ఢిల్లీ కేవలం 3 పరుగులే చేయగలిగింది. ఓవరాల్ గా కేకేఆర్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ 142 పరుగులు చేయగలిగింది. కోల్ కతా బౌలర్లలో అంకుల్ రాయ్ 2, కార్తీక్ రాయ్ 2 వికెట్లు తీశారు.
భారీ లక్ష్యం కాకపోవడంతో కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) దూకుడుగా ఆడింది. రహానే (13), రఘువంశీ (2) పరుగులకే వెనుదిరిగారు. అయితే మరో ఓపెనర్ ఫిన్ అలెన్ మాత్రం దుమ్మురేపాడు. గత కొన్ని మ్యాచ్ లలో పెద్దగా ఆడని అలెన్ ఢిల్లీపై మాత్రం విధ్వంసం సృష్టించాడు.

కామెరూన్ గ్రీన్ తో కలిసి కేవలం 64 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అలెన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అసలు అలెన్ శతకం సాధిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. అయితే విప్రజ్ వేసిన 13వ ఓవర్లోనూ, ఆ మరుసటి ఓవర్లోనే ఫిన్ అలెన్ ఏకంగా ఐదు సిక్సర్లు బాదేశాడు. అలెన్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 10 సిక్సర్లున్నాయి.
ఫలితంగా 94 పరుగులతో నాటౌట్ గా నిలుస్తాడనుకుంటే సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టును గెలిపించాడు.అతని జోరుతో కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) 14.2 ఓవర్లలోనే టార్గెట్ అందుకుంది.
Magic Figure : మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది..దళపతికి లైన్ క్లియర్





