Sleep : వీకెండ్‌లో ఎక్కువ నిద్రపోవడం నిజంగా హెల్దీనా? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న నిజాలు..

Sleep : నిజానికి మనం వీక్ అంతా తక్కువ నిద్రపోయినప్పుడు, మన శరీరం ఒక రకమైన నిద్ర అప్పు లేదా స్లీప్ డెట్‌లోకి వెళ్లిపోతుంది

Sleep

వారమంతా తెల్లవారుజామునే అలారాలు, ట్రాఫిక్ గొడవలు,ఆఫీస్ వర్క్ .. వీటన్నింటి మధ్య చాలామందికి కంటినిండా నిద్రపోవాలంటేనే అవదు. అందుకే శని, ఆదివారాలు రాగానే ఇక ఈ రెండు రోజులు ఫుల్‌గా పడుకోవాలి.. వారమంతా పడ్డ అలసటనంతా తీర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోతుంటారు. అయితే ఇలా వీకెండ్‌లో ఎక్స్‌ట్రా అవర్స్ పడుకోవడం నిజంగా బాడీకి మంచిదేనా? దీనివల్ల లాస్ అయిన నిద్ర తిరిగి వస్తుందా అనే దానిపై చాలామందికి డౌట్స్ వస్తాయి.

నిజానికి మనం వీక్ అంతా తక్కువ నిద్రపోయినప్పుడు, మన శరీరం ఒక రకమైన నిద్ర(Sleep) అప్పు లేదా స్లీప్ డెట్‌లోకి వెళ్లిపోతుంది. ఉదాహరణకు రోజుకు 8 గంటలు పడుకోవాల్సిన వ్యక్తి, కేవలం 6 గంటలే పడుకుంటే.. రోజుకు రెండు గంటల చొప్పున ఐదు రోజుల్లో పది గంటల నిద్ర(Sleep) మిగిలి ఉన్నట్లే అవుతుందన్న మాట.

ఈ అప్పును తీర్చడానికి వీకెండ్‌లో పది, పన్నెండు గంటలు పడుకోవడం వల్ల టెంపరరీగా కొంచెం ఫ్రెష్‌గా అనిపించొచ్చు. కొంతమంది రీసెర్చర్స్ చెబుతున్నదాని ప్రకారం ..ఇలా వీకెండ్‌లో కాస్త ఎక్కువ నిద్రపోవడం వల్ల ఆ వారంలో వచ్చిన స్ట్రెస్ కొద్దిగా తగ్గుతుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.

ఇలా వీకెండ్స్ లో విపరీతంగా నిద్రపోవడాన్ని సైన్స్ లాంగ్వేజ్‌లో సోషల్ జెట్ లాగ్ అంటారు. అంటే మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఫ్లైట్‌లో వెళ్లినప్పుడు టైమ్ జోన్ మారిపోయి బాడీ ఎలా కన్ఫ్యూజ్ అవుతుందో, వీకెండ్‌లో లేటుగా పడుకుని లేవడం వల్ల కూడా మన లోపల ఉండే జీవ గడియారం లేదా బాడీ క్లాక్ అలాగే కన్ఫ్యూజ్ అయిపోతుంది. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

ఎలా అంటే వీకెండ్‌లో రోజు కంటే 3,4 గంటలు ఎక్కువగా పడుకుంటే.. ఆదివారం రాత్రి టైమ్‌కు అస్సలు నిద్ర పట్టదు. ఎందుకంటే బాడీ క్లాక్ ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి. దీనివల్ల సోమవారం ఉదయం మళ్లీ అలారం మోగినప్పుడు నిద్ర సరిపోక, విపరీతమైన తలనొప్పి, నీరసం,చిరాకు వస్తాయి. దీనినే చాలామంది మండే బ్లూస్ అని పిలుస్తుంటారు.

Sleep

ఇలా వారంలో ఒకలా.. వీకెండ్‌లో మరోలా నిద్రపోవడం వల్ల మన శరీరంలోని మెటబాలిజం పూర్తిగా దెబ్బతింటుంది. దీనివల్ల బాడీ వెయిట్ పెరగడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పడం, గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరగడం వంటి సమస్యలు వస్తాయి. ఎంత ఎక్కువ పడుకున్నా సరే, వారమంతా నిద్రపోని దానికి కలిగే నష్టాన్ని ఈ రెండు రోజుల నిద్రతో వంద శాతం భర్తీ చేయలేమని నిపుణులు వివరిస్తున్నారు.

అందుకే వీకెండ్ అయినా సరే ప్రతిరోజూ పడుకునే టైమ్, లేచే టైమ్‌ ఒకేలా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ వారంలో నిద్ర(Sleep) చాలకపోతే, వీకెండ్‌లో మరీ 10, 12 గంటలు పడకపైనే ఉండకుండా.. మధ్యాహ్నం పూట ఒక అరగంట , ముప్పావు గంట చిన్నపవర్ నాప్ తీయడం చాలా మంచిదని అంటారు. అంతే కానీ వీకెండ్ దొరికింది కదా అని రోజంతా బెడ్‌కే అంకితం అయిపోతే బాడీ క్లాక్ పాడైపోయి లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.

Vijay Devarakonda : టీజీ20 లీగ్ పై టీసీఏ ఫైర్..విజయదేవరకొండకు నోటీసులు

Exit mobile version