Body Heat
గుల్కంద్‌లో చలువ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒక గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ గుల్కంద్‌ను కలుపుకుని తాగితే బాడీ టెంపరేచర్(Body Heat) తగ్గుతుంది.
ఈ ఏడాది సమ్మర్ ముందే వచ్చినట్లు ఎండలు మండిపోతున్నాయి. మధ్యలో కాస్త వర్షాలు పడినా,మళ్లీ ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిజానికి ఎండల వల్ల శరీరంలో పిత్త దోషం పెరుగుతుంది. దీని వల్ల కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలను దూరం చేసుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన డ్రింక్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరం లోపల నుంచి కూల్ అవడమే కాకుండా హాయిగా నిద్ర పడుతుందట.
వీటిలో మొదటిది గుల్కంద్ పాలు. గుల్కంద్‌లో చలువ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ గుల్కంద్‌ను కలుపుకుని తాగితే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది.
అలాగే వేసవిలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన పానీయం..మజ్జిగ. మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్‌ను కూడా అందిస్తాయి. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయం చల్లబడుతుంది.
అంతేకాదు వేసవిలో నిమ్మరసంలో చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ కలుపుకొని తాగడం వల్ల బాడీకి తక్షణ శక్తి లభిస్తుంది. ఇవి శరీరంలోని వేడి(Body Heat)ని పీల్చుకుంటాయి. అలాగే చెరకు రసం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్‌స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది.
అయితే వీటన్నింటికంటే ముందు వేసవిలో మంచినీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. బాడీలో నీరు చెమట రూపంలో పోతుంది. మూత్రంలో మంట వంటి సమస్యలు ఉంటే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రిలీఫ్ వస్తుంది.
రాత్రి పూట తీసుకునే అరటి గుజ్జు రసం కూడా బాడీలోని మంటను తగ్గిస్తుంది. ఇలాంటి సహజసిద్ధమైన పానీయాలను
తీసుకోవడం చేత ఎండల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మనం ఈజీగా బయటపడొచ్చు.
PCB : అదో చెత్త క్రికెట్ బోర్డు…పీసీబీపై కిరిస్టెన్ కామెంట్స్
