Just SportsLatest News

PCB : అదో చెత్త క్రికెట్ బోర్డు…పీసీబీపై కిరిస్టెన్ కామెంట్స్

PCB : ప్రపంచ క్రికెట్ లో అనిశ్చితి కేరాఫ్ అడ్రస్ పాక్ జట్టయితే, వివాదాలకు కేంద్రబిందువు పాక్ క్రికెట్ బోర్డే అనడంలో ఎలాంటి సందేహం లేదు

PCB

ప్రపంచ క్రికెట్ లో అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ పాక్ జట్టయితే, వివాదాలకు కేంద్రబిందువు పాక్ క్రికెట్ బోర్డే(PCB) అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పాక్ క్రికెట్ బోర్డులో ఉండే రాజకీయాల దెబ్బకు ఏ కోచ్ కూడా ఆరు నెలలు మించి అక్కడ కొనసాగలేకపోతున్నారు. ముఖ్యంగా పీసీబీ చీఫ్ గా నక్వీ వచ్చిన తర్వాత అయితే అరాచకం మరింత పెరిగిందన్నది వాస్తవం. తాజాగా మాజీ కోచ్ గ్యారీ కిరిస్టెన్ చెప్పిన మాటలతో ఇది మరోసారి స్పష్టమవుతోంది.

గతంలో రెండేళ్లకు ఒప్పందం కుదుర్చుకుని కేవలం ఆరు నెలల లోపే రాజీనామా చేసి వచ్చేసిన కిరిస్టెన్ పాక్ క్రికెట్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2024 ఏప్రిల్ లో పాక్ జట్టు హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న గ్యారీ అక్టోబర్ కే తప్పుకున్నాడు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో బోర్డు జోక్యం కారణంగానే తాను రాజీనామా చేసినట్టు అప్పట్లోనే చెప్పాడు. తాజాగా దీనిపై మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను చూసిన జట్లలో ఈ స్థాయి జోక్యం ఎక్కడా కనిపించలేదన్నాడు.

కోచ్ గా వచ్చి ఆటగాళ్లతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే బయట నుంచి వచ్చే జోక్యం ఇబ్బందిగా మారుతుందన్నాడు. ముఖ్యంగా నక్వీ ఆధ్వర్యంలోని పాక్ బోర్డు వర్క్ కల్చర్ పైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. జట్టు సరైన ఫలితాలు సాధించకపోతే కోచ్ పైనే ఒత్తిడి తెచ్చి ఆంక్షలు విధించడం సరికాదన్నాడు. అలాంటప్పుడు కోచ్ ను ఎందుకు నియమిస్తారని ప్రశ్నించాడు.

ప్రస్తుతం కిరిస్టెన్ శ్రీలంక క్రికెట్‌ జట్టుకు హెడ్ కోచ్ గా నియమితుడయ్యాడు. రెండేళ్ల పాటు ఈ పదనిలో కొనసాగనున్న కిరిస్టెన్ కు కోచ్ గా అద్భుతమైన రికార్డుంది. తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్ లో 14 వేలకు పైగా రన్స్ చేసిన గ్యారీ 2011లో భారత్ కు ప్రపంచకప్ అందించాడు.

PCB
PCB

కాగా కిరిస్టెన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పాక్ క్రికెట్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ దేశ మాజీలు కూడా గ్యారీ కామెంట్స్ ను సమర్థిస్తున్నారు. పీసీబీ చీఫ్ నక్వీ తీరుపై మండిపడుతున్నారు. నక్వీతో పాటు అంతకుముందు ఈ పదవుల్లో ఉన్న వారందరూ పాక్ జట్టు ఎంపికలో విపరీతంగా జోక్యం చేసుకున్నారు.

ఈ కారణంగానే పాక్ కోచ్ పదవిని చేపట్టిన వారిలో ఎక్కువ మంది 6 నెలలు లేదా ఏడాది లోపే బయటకు వచ్చేసారు. మూడేళ్లలో ఆరుగురు కోచ్ లు మారారంటే పాక్ క్రికెట్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిరిస్టెన్ తో పాటు అంతకుముందు ఆసీస్ దిగ్గజం జాసన్ గిలెస్పీ సైతం పాక్ బోర్డులో విష సంస్కృతి ఎక్కువగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.

SRH : సన్ ”రైజ్” అయ్యేనా ?..మళ్లీ బలహీనంగానే బౌలింగ్

Related Articles

Back to top button