Surgery And Cast : సర్జరీ చేసేముందు క్యాస్ట్ అడుగుతున్నారా? ఏంటీ మెడికల్ మిస్టరీ?

Surgery And Cast : తరతరాలుగా సొంత కమ్యూనిటీలోనే మ్యారేజ్‌లు చేసుకోవడం వల్ల జన్యు మ్యుటేషన్ వైశ్య వర్గంలో ఎక్కువగా కొనసాగుతూ వచ్చినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

Surgery And Cast

సర్జరీకి రెడీ అయ్యే ముందు డాక్టర్ వచ్చి మీ హెల్త్ హిస్టరీ కంటే ముందు మీది ఏ క్యాస్ట్ అని అడిగితే ఎవరైనా షాక్ అవుతారు. మెడికల్ ఎమర్జెన్సీలో ఈ కులం గొడవేంటి అని కోపం కూడా వస్తుంది. కానీ, అక్కడ డాక్టర్లు అడిగేది తమ సామాజిక వర్గమా కాదా అని తెలుసుకోవడానికి మాత్రం కాదని.. పేషెంట్ ప్రాణాలను నిలబెట్టడానికే అన్న విషయం చాలామందికి తెలీదు.

డాక్టర్లు క్యాస్ట్ గురించి ఎందుకు అడుగుతారంటే.. కొన్ని ప్రత్యేక కమ్యూనిటీల బ్లడ్‌లో పుట్టుకతోనే ఒక సీక్రెట్ ఎంజైమ్ మిస్ అవుతుంది. అందుకే కులం గురించి తెలుసుకోకుండా జనరల్ డోస్ మత్తుమందు ఇచ్చేస్తే.. సర్జరీ పూర్తయ్యాక కూడా ఆ పేషెంట్ గంటల తరబడి కోమాలోకి వెళ్లినట్లు పడి ఉంటాడు. అంతేకాదు శ్వాస కూడా తీసుకోవడానికి కష్టపడతారు. అసలు ఏంటి ఆ వింత మెడికల్ కండీషన్? సౌత్ ఇండియాలోని ఏ వర్గానికి ఈ రిస్క్ ఎక్కువగా ఉందనేది చూద్దాం.

మనిషి ఒంట్లో కాలేయం తయారుచేసే సూడోకోలినెస్టరేస్ అనే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది బ్లడ్‌లో తిరుగుతూ మనుషులు తినే మందులను, ముఖ్యంగా ఆపరేషన్ సమయంలో కండరాలను లూజ్ చేయడానికి ఇచ్చే సక్సినిల్‌ కోలిన్ (Succinylcholine), మివాక్యూరియం(Mivacurium) వంటి హెవీ అనస్థీషియా డ్రగ్స్‌ను విచ్ఛిన్నం చేసి, వాటి ఎఫెక్ట్‌ను ఐదు-పది నిమిషాల్లో తగ్గిస్తుంది. కానీ జన్యుపరమైన సమస్యల వల్ల కొందరిలో ఈ ఎంజైమ్ అసలు ప్రొడ్యూస్ కాకపోవచ్చు లేదా సరిగ్గా పనిచేయకపోవచ్చు.

డైలీ లైఫ్‌లో ఈ ఎంజైమ్ లేకపోయినా ఏమీ తేడా తెలీదు. ఎలాంటి వ్యాధి లక్షణాలు ఉండవు. కానీ ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లినపుడు, డాక్టర్లు కండరాలు సడలించడానికి సక్సినిల్‌ కోలిన్(స్కోలిన్) ఇంజెక్షన్ ఇవ్వగానే అసలు కథ మొదలవుతుంది. ఈ ఎంజైమ్ లోపం ఉన్నవారిలో ఆ మెడిసిన్‌ను విచ్ఛిన్నం చేసే శక్తి బాడీకి ఉండదు. దాంతో సాధారణంగా 10 నిమిషాల్లో తగ్గిపోవాల్సిన మెడిసిన్ ఎఫెక్ట్.. ఏకంగా 6 నుంచి 24 గంటల పాటు ఒంట్లోనే ఉండిపోతుంది.

మత్తుమందు ఇచ్చినప్పుడు గొంతులో విండ్ పైప్ వేయడానికి ఈ స్కోలిన్ ఇస్తారు. దీనివల్ల రోగి కొంతసేపు సొంతంగా శ్వాస తీసుకోలేడు. సాధారణ మనుషులైతే 10-15 నిమిషాల్లో కోలుకుని శ్వాస తీసుకుంటారు. కానీ ఈ ఎంజైమ్ లోపం ఉన్నవారు కండరాలు పనిచేయక పెరాలసిస్ వచ్చినట్లు పడి ఉంటారు.

వీరి ప్రాణాలు కాపాడటానికి వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి, ఆర్టిఫిషియల్ శ్వాస అందించాల్సి వస్తుంది. పైగా ఈ మెడిసిన్ ఎఫెక్ట్‌ను వెంటనే తగ్గించే మ్యాజిక్ మెడిసిన్ ఏదీ మార్కెట్లో లేకపోవడంతో..పేషెంట్ మెల్లగా కోలుకునే వరకు గంటల తరబడి వెంటిలేటర్‌పైనే ఉంచాలి.

Surgery And Cast

దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో నివసించే ఆర్య వైశ్య, కోమటి చెట్టియార్, వైశ్య చెట్టి కమ్యూనిటీలకు చెందిన కొందరిలోనే ఈ జన్యు లోపం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.

తరతరాలుగా సొంత కమ్యూనిటీలోనే మ్యారేజ్‌లు చేసుకోవడం వల్ల ఈ జన్యు మ్యుటేషన్ వైశ్య వర్గంలో ఎక్కువగా కొనసాగుతూ వచ్చినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి 24 మందిలో ఒకరికి అయినా ఈ టైప్ సైలెంట్ జీన్ మ్యుటేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఇంటర్‌ క్యాస్ట్ మ్యారేజెస్ పెరుగుతుండటంతో ఈ లోపం మెల్లగా తగ్గుతోంది.

అనస్థీషియా డాక్టర్లు సర్జరీకి ముందు పేషెంట్ ఆర్య వైశ్య లేదా సంబంధిత వర్గానికి చెందినవారా అని అడుగుతారు. ఒకవేళ ఆ వర్గానికి చెందినవారైతే.. స్కోలిన్‌కు బదులుగా వేరే మందులను ఉపయోగిస్తారు. దీనివల్ల చిన్న ఆపరేషన్ తర్వాత కూడా ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచాల్సిన అవసరం ఉండదు,పైగా హాస్పిటల్ బిల్లుల భారం తగ్గుతుంది.

Japanese Ma Theory : ఎప్పుడూ కలిసి ఉండటమే కాదు..బంధం గట్టిపడాలంటే చిన్న దూరం కూడా అవసరమేనట..

Exit mobile version