Headache : టెన్షన్ వల్ల హెడేక్ వస్తుందా? టెన్షన్ తగ్గినా తగ్గని తలనొప్పికి ఎలా చెక్ పెట్టాలి?

Headache : టెన్షన్ పడే సమయంలో వచ్చే ఈ తలనొప్పిని వెంటనే పోగొట్టుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. దీని కోసం కంగారులో ఉన్నప్పుడు మన శ్వాస చాలా వేగంగా, పైపైనే సాగుతుంది కాబట్టి, టెన్షన్ స్టార్ట్ అవగానే ముందుగా బాక్స్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి.

Headache

చాలా సార్లు చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడుతుంటాం. అంతేకాదు మైండ్‌లో ఇలా టెన్షన్ రన్ అవగానే హెడ్డేక్ స్టార్ట్ అవడం కూడా గమనిస్తుంటాం. చివరకు టెన్షన్ పడ్డ ఆ పని పూర్తయినా సరే..ఆ సమయంలో వచ్చిన తలనొప్పి మాత్రం వదలదు. అయితే ఇలా జరిగినపుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ తలనొప్పి రాకుండా ఉంటుందని , వచ్చినా వెంటనే పోతుందని డాక్టర్లు చెబుతున్నారు.

మనం ఏదైనా ఒక పని గురించో, ఒక విషయం గురించో కంగారు పడుతున్నప్పుడు..మన మెదడులోని హైపోథాలమస్ అనే పార్ట్ వెంటనే అలర్ట్ అయిపోతుంది. దీంతో అడ్రినల్ గ్రంథుల ద్వారా కార్టిసాల్, అడ్రినలిన్ అనే స్ట్రెస్ హార్మోన్లను బాడీలోకి ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరాన్ని ఒక అత్యవసర పరిస్థితికి రెడీ చేయడం వల్ల తల భాగానికి వెళ్లే రక్తనాళాలు ఒక్కసారిగా కుచించుకుపోతాయి. దీంతోనే కొన్నిసార్లు మనకు తెలీకుండానే మెడ, దవడ కండరాలు కూడా బిగుసుకుపోతాయి.

ఇలా టెన్షన్‌లో ఉన్నప్పుడు బిగుసుకుపోయిన కండరాల అలసట వల్ల.. లాక్టిక్ యాసిడ్ పేరుకుపోయి, హెడ్ చుట్టూ ఒక పట్టీ వేసి లాగుతున్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా టెన్షన్ వల్ల కలిగిన కంగారులో సరిగ్గా బ్రీతింగ్ తీసుకోకపోవడం వల్ల బ్రెయిన్‌కి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, డీహైడ్రేషన్‌కు గురవడం కూడా జరుగుతాయి.

అయితే టెన్షన్ పడే సమయంలో వచ్చే ఈ తలనొప్పిని(Headache) వెంటనే పోగొట్టుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. దీని కోసం కంగారులో ఉన్నప్పుడు మన శ్వాస చాలా వేగంగా, పైపైనే సాగుతుంది కాబట్టి, టెన్షన్ స్టార్ట్ అవగానే ముందుగా బాక్స్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి.

అంటే ఒక 4 సెకన్లు గాలి పీల్చడం, 4 సెకన్లు హోల్డ్ చేయడం, మళ్లీ 4 సెకన్లలో వదలడం. ఇలా ఒక 2 నిమిషాలు చేయడం వల్ల మెదడులోని హైపోథాలమస్ శాంతించి, ఆ స్ట్రెస్ హార్మోన్ల రిలీజ్‌ను ముందే అడ్డుకుంటుంది. దీనివల్ల రక్తనాళాలు కుచించుకుపోయే ప్రాసెస్ అక్కడికక్కడే ఆగిపోతుంది.

అలాగే టెన్షన్ లో ఉన్నప్పుడు మంచి నీటిని కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగాలి. ఇది బాడీ టెంపరేచర్‌ను నార్మల్ చేసి, రక్త ప్రసరణను స్థిరంగా ఉంచుతుంది. అలాగే కాన్షియస్‌గా దవడలను ఫ్రీగా వదిలేస్తూ, భుజాలను కిందకు దించడం వల్ల నరాలపై ఒత్తిడి తగ్గి తలనొప్పి ఆగిపోతుంది.

Headache

ఒకవేళ అంతవరకూ దేని గురించి టెన్షన్ పడ్డామో..అది పూర్తి అయిపోయినా కూడా తలనొప్పి(Headache) మాత్రం వదలకపోతే.. ఒకేసారి సడన్‌గా కాకుండా గ్రాడ్యువల్‌గా రిలాక్స్ అవ్వడం అలవాటు చేసుకోవాలి. ఇలా పని అవ్వగానే అలా బెడ్ మీద పడిపోకుండా, ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని దీర్ఘంగా గాలి పీల్చుతూ వదులుతూ ఉండాలి. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి, రక్తనాళాల్లో వచ్చే సడన్ మార్పులు కంట్రోల్‌లోకి వస్తాయి.

అలాగే హెడేక్(Headache) ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగడం, మెడను మెల్లగా అటు ఇటు తిప్పుతూ చిన్నగా స్ట్రెచ్ చేయడం, కణతలను మసాజ్ చేయడం వల్ల కండరాల్లో పేరుకుపోయిన స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. చివరిగా, కెఫీన్ తక్కువగా ఉండే ఒక కప్పు లైట్ కాఫీ కానీ అల్లం టీ తాగడం కానీ చేస్తే మంచిది. దీని వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల వాపును తగ్గించి తలనొప్పి నుంచి వెంటనే రిలీఫ్‌ను ఇస్తాయి.

AI Impact : మాకు ఏఐ సేవలు వద్దు బాబోయ్ ..ఉద్యోగులను వెనక్కి పిలుస్తున్న కంపెనీలు..

Exit mobile version