Custard:తింటూనే వెయిట్ తగ్గండి.. ఈ టేస్టీ కస్టర్డ్ ట్రై చేయండి

Custard : రాత్రిపూట ఆకలి వేసినప్పుడు చిప్స్ , బిస్కెట్లు -తినే బదులు ఆరోగ్యకరమైన కస్టర్డ్ తీసుకోవడం వల్ల ఈజీగా వెయిట్ తగ్గుతారు.

Custard

బరువు తగ్గాలి అనుకున్న మరుక్షణం చాలామంది తిండి మానేస్తారు. మెయిన్‌గా తీపి పదార్థాలను అసలు ముట్టుకోకూడదని అనుకుంటారు. కానీ మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని, నచ్చినవి తింటూనే బరువు తగ్గొచ్చు.

దీనికోసం రాత్రి పూట పడుకునే ముందు తినడానికి ఒక మంచి రెసిపీ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా రుచిగా ఉండటంతో పాటు బాడీకి అవసరమైన ప్రోటీన్లను కూడా ఇస్తుంది. సాధారణంగా మనం తినే స్వీట్లలో పంచదార ఎక్కువగా ఉండటంతో దానివల్ల బరువు పెరుగుతాము.

కానీ దీనిలో మనం పంచదార వాడం. దీనికి బదులుగా మఖానా (తామర గింజలు), డ్రై ఫ్రూట్స్ పొడి , పండ్లను మాత్రమే వాడతాము. ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోయే ఫుడ్ ఇది. దీనివల్ల మన కడుపు నిండుగా ఉండటంతో పాటు శరీరానికి శక్తి కూడా అందుతుంది.

Custard

ముందుగా కొన్ని మఖానాలు, డ్రై ఫ్రూట్స్ పొడి , కొంచెం కుంకుమపువ్వును పాలలో నానబెట్టాలి. అది మెత్తగా అయ్యాక దానిలో ఆపిల్ ముక్కలు, కివీ, దానిమ్మ గింజలు, అరటిపండు , ద్రాక్ష పండ్లు వంటి మనకు నచ్చిన పండ్లను కలుపుకోవాలి. పండ్లలో ఉండే నేచురల్ షుగర్‌ వల్ల ఈ కస్టర్డ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఇంకా తీపి కావాలనుకుంటే మాత్రం కొంచెం తేనె వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకుని దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది.

దీనిలో ఉండే పండ్లు మనకు విటమిన్లను ఇస్తాయి, మఖానా , పాలు మనకు ప్రోటీన్లను ఇస్తాయి. దీనివల్ల మనకు ఆకలి వేయదు , అనవసరమైన కేలరీలు మన శరీరంలోకి చేరవు. రాత్రిపూట ఆకలి వేసినప్పుడు చిప్స్ , బిస్కెట్లు తినే బదులు, ఇలాంటి ఆరోగ్యకరమైన కస్టర్డ్ తీసుకోవడం వల్ల ఈజీగా వెయిట్ తగ్గుతారు. అయితే లేట్ నైట్ కాకుండా 8-9 గంటల లోపు తినేయాలి.

Paneer :విస్తరిస్తున్న కల్తీ పన్నీర్ మాఫియా.. దీనిని ఎలా గుర్తించాలి?

Exit mobile version