Just TelanganaHealthLatest News

Paneer :విస్తరిస్తున్న కల్తీ పన్నీర్ మాఫియా.. దీనిని ఎలా గుర్తించాలి?

Paneer : ఈ ముఠాలు లాభాల కోసం పాల పొడితో పాటు పామ్ ఆయిల్, గ్లిజరిన్ , కొన్ని సందర్భాల్లో రసాయనాలను వాడుతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నాయి.

Paneer

హైదరాబాద్ నడిబొడ్డున తరచూ పన్నీర్ ప్రియులను వణికించే నిజాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మహంకాళి పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మనం హోటళ్లలో ఎంతో ఇష్టంగా తినే పన్నీర్(Paneer) స్వచ్ఛమైన పన్నీరా లేక మన ప్రాణాలను తీసే విషమా అనే అనుమానం మరింత ఎక్కువ అవుతుంది.

ఖైరతాబాద్ జోన్ పరిధిలో జరిగిన ఈ దాడుల్లో సుమారు మూడు టన్నుల కల్తీ పన్నీర్‌(Paneer)ను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఒక పెద్ద కమర్షియల్ ట్రక్కు నిండా పట్టేంత పరిమాణంలో ఉన్న ఈ కల్తీ సరుకును చూసి అధికారులు కూడా షాక్ తిన్నారు. ఇది కేవలం ఒక చిన్న స్థాయిలో జరుగుతున్న మోసం కాదనీ, సిటీ మొత్తం విస్తరించిన ఒక పక్కా సప్లై చైన్ మాఫియాగా పోలీసులు గుర్తించారు.

మార్కెట్‌లోకి వస్తున్న ఈ విషపూరిత పన్నీర్‌లో దాదాపు 86 శాతం కేవలం రెండు ప్రధాన కేంద్రాల నుంచే సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలింది. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్ , విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్ వంటి సంస్థలు ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పోలీసులు ఆధారాలు సేకరించారు.

సాధారణంగా పన్నీర్ తయారీకి పాలు అవసరమన్న సంగతి తెలిసిందే. కానీ ఈ ముఠాలు లాభాల కోసం పాల పొడితో పాటు పామ్ ఆయిల్, గ్లిజరిన్ , కొన్ని సందర్భాల్లో రసాయనాలను వాడుతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నాయి. తక్కువ ధరకే వస్తోంది కదా అని బ్రాండ్ లేని పన్నీర్‌ను కొనుగోలు చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Paneer
Paneer

ఈ కల్తీ మహమ్మారిని అరికట్టాలంటే ప్రభుత్వం, వినియోగదారులు ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం కంప్లైంట్‌లు వచ్చినప్పుడే కాకుండా, కంటిన్యూగా హోటళ్లు డైరీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించాలి. కల్తీకి పాల్పడే వారి లైసెన్సులను రద్దు చేయడంతో పాటు కఠినమైన శిక్షలు అమలు చేయాలి.వినియోగదారులు కూడా మార్కెట్‌లో లూజ్‌గా దొరికే పన్నీర్ అస్సలు కొనకూడదు.

లూజ్‌ పనీర్ కంటే నమ్మకమైన బ్రాండెడ్ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. హోటళ్లలో తినేటప్పుడు నాణ్యతను గమనించడం, ఇంట్లో పన్నీర్ వాడేటప్పుడు అది రబ్బరులా సాగుతుందేమో చూడాలి. అలాగే సహజమైన వాసన వస్తుందా అని పరీక్షించుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశంసలు

Related Articles

Back to top button