Mosquitoes
ఎండకాలం ముగిసి, వర్షాకాలం రాబోతోంది. ఈ సమయంలో అందరినీ వేధించే అతిపెద్ద సమస్య దోమలు. వర్షాలు పడటం మొదలైతే చాలు.. దోమల దండు తయారవుతుంది. అయితే ఒకే చోట 10 మంది కూర్చున్నా సరే దోమలు మాత్రం కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి. పక్కన ఉన్నవారిని వదిలేసి ఒకరిపైనే గుంపుగా పడతాయి.
దోమకు నా బ్లడ్ తీయగా ఉందేమో, అందుకే నన్నే కుడుతున్నాయని చాలామంది జోకులు వేస్తుంటారు కానీ, దీని వెనుక ఒక బలమైన సైన్స్ దాగి ఉందట. కొంతమందిని దోమలు నిజంగానే ఎక్కువగా ఆకర్షిస్తాయని తాజా పరిశోధనలు వెల్లడించాయి. అయితే దీనికి అందరూ అనుకున్నట్లు బ్లడ్ గ్రూప్ రీజన్ కాదట.
దోమలు(Mosquitoes) కొందరిని ఎక్కువగా కుట్టడానికి వారి శరీరం నుంచి వెలువడే వాసనే మెయిన్ రీజన్. చర్మంపై ఉండే సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కెమికల్స్ కలయిక.. ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. ఈ డిఫరెంట్ వాసనల ఆధారంగానే దోమలు తమ టార్గెట్‌ను ఎంచుకుంటాయి.
కొందరి బాడీ నుంచి వచ్చే రసాయనాలు దోమలకు మంచి పానీయంగా మరింత ఆకర్షణీయంగా అనిపిస్తాయట. అలాగే మనుషులు వదిలే శ్వాసలోని కార్బన్‌డైఆక్సైడ్‌ను దోమలు సుమారు 50 మీటర్ల దూరం నుంచే ఈజీగా గుర్తిస్తాయి. ఇదే వాటికి తొలి సిగ్నల్‌గా పనిచేస్తుందట.
ముందుగా మనుషుల శ్వాసను పసిగట్టి దగ్గరకు వచ్చిన తర్వాత బాడీ వాసనను చూస్తాయట. ఆ తర్వాత స్కిన్ టెంపరేచర్ , తేమ స్థాయిలను కూడా లెక్కిస్తూ ఎవరిని కుట్టాలో ఫైనల్‌గా డిసైడ్ అయ్యి..తమ పనిని స్టార్ట్ చేస్తాయి.
పరిశోధనల్లో తేలిన మరో షాకింగ్ విషయం ఏంటంటే.. గర్భధారణ రెండో దశలో ఉన్న మహిళలను దోమలు(Mosquitoes) ఎక్కువగా టార్గెట్ చేస్తాయి. గర్భిణుల బాడీలో వన్ ఆక్టెన్ త్రీ ఆల్ అనే కెమికల్ ఎక్కువగా ఉత్పత్తి కావడమే దీనికి కారణం. ఈ కెమికల్ స్మెల్ వస్తే చాలు దోమలు వాలిపోతాయి.
అలాగే, చాలాకాలంగా ఉన్న నమ్మకం ప్రకారం ఓ పాజిటివ్ కానీ ఏబీ బ్లడ్ గ్రూప్ వాళ్లను కానీ దోమలు ఎక్కువ కుడతాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు అంటున్నారు. అసలు బ్లడ్ గ్రూప్‌తో గానీ, చర్మం రంగుతో గానీ దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇక వీటన్నిటితో పాటు ఆల్కహాల్ సేవించిన వారిని, ముఖ్యంగా బీర్ తాగిన వారిని మస్కిటోస్(Mosquitoes) విపరీతంగా ఆకర్షిస్తాయి. బీర్ తాగిన తర్వాత బాడీ టెంపరేచర్ పెరగడంతో పాటు, స్కిన్ నుంచి వెలువడే కార్బన్‌డైఆక్సైడ్, వాసనల్లో మార్పులు వస్తాయి. దాంతో దోమలు అలాంటి వారిని చాలా ఈజీగా పసిగట్టి అటాక్ చేస్తాయి.
త్వరలోనే వర్షాకాలం స్టార్ట్ అవబోతోంది కాబట్టి, దోమల ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి రోగాల బారిన పడకుండా ముందే అలర్ట్ అవ్వాలి . ఇంటికి దగ్గరలో పాత టైర్లు, పూల కుండీలు, కూలర్లలో నీరు స్టాక్ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే దోమలు గుడ్లు పెట్టడానికి ఇవే ప్రధాన స్థావరాలుగా మారతాయి.
సాయంత్రం పూట ఒంటిని పూర్తిగా కప్పి ఉంచే బట్టలను ధరించడం మంచిది. రాత్రి పడుకునేటప్పుడు దోమతెరలు వాడాలి. బాడీపై చెమట, బ్యాక్టీరియా చేరకుండా ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేయడం వల్ల కూడా దోమలను(Mosquitoes) ఆకర్షించే శరీర వాసనలను కొంతవరకు తగ్గించొచ్చు.
Numerology : నెంబర్ 3 వారి మైండ్ సెట్..వీరితో పెట్టుకుంటే అంతే సంగతులు!
