Brown Sugar : వైట్ షుగర్, బ్రౌన్ షుగర్‌లో ఏది మంచిది? డయాబెటిస్ ఉన్నవాళ్లు బ్రౌన్ షుగర్ తినొచ్చా?

Brown Sugar : బ్రౌన్ షుగర్‌లో మొలాసిస్‌ను అలాగే ఉంచడంతో పాటు వైట్ షుగర్‌లో మొలాసిస్‌ను కలిపి తయారు చేస్తారు.

Brown Sugar

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో మనం తినే షుగర్ విషయంలో వైట్ షుగర్ , బ్రౌన్ షుగర్ మధ్య.. ఏది మంచిదనే చర్చ చాలా రోజుల నుంచి జరుగుతోంది. చాలామంది వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అనుకుంటారు. కానీ నిజానికి ఈ రెండింటి మధ్య ఉండే తేడా చాలా తక్కువ. ఎందుకంటే ఈ రెండు రకాల షుగర్‌లు కూడా చెరకు రసం నుంచే తయారవుతాయి.

వైట్ షుగర్‌ను తయారు చేసే ప్రక్రియలో దానిలోని మొలాసిస్ అనే జిగట ద్రవాన్ని పూర్తిగా తొలగించి శుద్ధి చేస్తారు. అయితే బ్రౌన్ షుగర్‌లో ఈ మొలాసిస్‌ను అలాగే ఉంచడంతో పాటు వైట్ షుగర్‌లో మొలాసిస్‌ను కలిపి తయారు చేస్తారు. ఈ మొలాసిస్ వల్ల బ్రౌన్ షుగర్‌కు ఆ గోధుమ రంగు, బెల్లం వంటి ప్రత్యేకమైన రుచి వస్తుంది.

Brown Sugar

పోషక పరంగా చూస్తే బ్రౌన్ షుగర్‌(Brown Sugar)లో మొలాసిస్ ఉండటం వల్ల అందులో కొద్ది మొత్తంలో కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. కానీ ఇవి ఎంత తక్కువ మొత్తంలో ఉంటాయంటే.. వీటి వల్ల శరీరానికి ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలేవీ కలగవు. కేలరీల విషయానికి వస్తే ఒక టేబుల్ స్పూన్ వైట్ షుగర్‌లో 16 కేలరీలు ఉంటే, బ్రౌన్ షుగర్‌లో 15 కేలరీలు ఉంటాయి. అంటే వెయిట్ తగ్గాలనుకునే వారికి ఈ రెండింటి మధ్య పెద్దగా తేడా ఉండదు.

బ్రౌన్ షుగర్(Brown Sugar) డయాబెటిస్ బాధితులకు సురక్షితమనేది ఒక పెద్ద అపోహ మాత్రమే. నిజానికి వైట్ షుగర్ , బ్రౌన్ షుగర్ రెండూ రక్తంలోని చక్కెర స్థాయిలను ఒకే విధంగా పెంచుతాయి. డయాబెటిస్ ఉన్నవారు, ఓవర్ వెయిట్‌తో ఇబ్బంది పడేవారు ఇలా ఎవరైనా సరే చక్కెర ఏదైనా సరే దానిని తక్కువ తీసుకోవడం, పూర్తిగా దూరంగా ఉండటమే మంచిది. బేకింగ్‌లో డిఫరెంట్ టేస్ట్ కోసం బ్రౌన్ షుగర్‌ను ఎంచుకోవచ్చు. ఆరోగ్య దృక్కోణం నుంచి అది వైట్ షుగర్ కంటే గొప్పదేమీ కాదు.

Coconut Water: కొబ్బరి నీళ్లను నిల్వ చేసి తాగుతున్నారా? అయితే ఇది మీ కోసమే..

Exit mobile version