Winter Brain Stroke : 20 శాతం పెరిగిన బ్రెయిన్ స్ట్రోక్ కేసులు. వింటర్ సీజన్ సైలెంట్ అటాక్‌కు ఇలా చెక్ పెట్టండి..

Winter Brain Stroke : చలికాలం మార్నింగ్ టైమ్‌లో రక్తనాళాలు ముడుచుకుపోవడం వల్ల పక్షవాతం (స్ట్రోక్) ముప్పు పెరుగుతుంది. మరి దీనిపై న్యూరాలజిస్టుల హెచ్చరికలు మరియు కాపాడుకునే మార్గాలు ఇక్కడ చూడండి.

Winter Brain Stroke

ప్రతీ రోజూ నిద్ర లేచే ప్రశాంతమైన ఉదయమే.. కొందరి లైఫ్‌లో కోలుకోలేని చీకట్లను నింపుతోంది. చలికాలం వచ్చిందంటే చాలు హాస్పిటల్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులు పెరాలసిస్ స్ట్రోక్ బాధితులతో కిక్కిరిసిపోతున్నాయని న్యూరాలజిస్టులు చెబుతున్నారు.

నిన్నటి వరకూ బాగానే ఉన్నారు కానీ ఈరోజు పొద్దున్నే సడన్‌గా పక్షవాతం వచ్చిందనే మాటలు ఈ సీజన్‌లోనే ఎక్కువగా వింటూ ఉంటాం. రోజువారీ సగటుతో పోలిస్తే ఒక్క చలికాలంలోనే స్ట్రోక్(Winter Brain Stroke) బారిన పడేవారి సంఖ్య ఏకంగా 20 శాతానికి పైగా ఎగబాకడమే ఇప్పుడు అందరిలో భయాన్ని రేపుతోంది.

అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యన ఈ సైలెంట్ అటాక్స్ ఎక్కువగా జరుగుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. రాత్రంతా వెచ్చగా నిద్రపోయిన మనిషి బాడీ ఉదయాన్నే మేల్కొనేటపుడు బీపీ నేచురల్‌గానే కాస్త పెరుగుతుంది. సరిగ్గా అదే టైమ్‌లో ఒక్కసారిగా బయట చలిలోకి అడుగుపెడితే, రక్తనాళాలు క్షణాల్లో ముడుచుకుపోతాయి. దీంతో రక్తప్రసరణ ఆగిపోయి, బీపీ ఒక్కసారిగా హైకి చేరి నరాలు చిట్లిపోవడం లేదా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. ఈ ఒక్క చిన్న అలసత్వమే మనిషిని లైఫ్ లాంగ్ మంచాన పడేలా చేస్తోంది.

ఈ వింటర్ సీజన్‌లో ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లెమ్స్‌తో బాధపడేవారు రిస్క్ జోన్‌లో ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే నాన్ స్టాప్‌గా సిగరెట్లు తాగే అలవాటు ఉన్నవారు, గతంలో స్ట్రోక్ వచ్చి కోలుకున్న వారు కూడా ఈ చలికాలంలో మరింత డేంజర్‌లో ఉన్నట్లే లెక్క.

అందుకే బెడ్ మీద నుంచి లేవగానే సడన్‌గా బయటకు వాకింగ్‌కో, జాగింగ్‌కో, లేదా బయట పనుల కోసమో పరుగెత్తకుండా, బాడీని ముందు కాస్త నార్మల్ రూమ్ టెంపరేచర్‌కి అలవాటు పడనివ్వాలి. బయటకు వెళ్లాల్సి వస్తే ఒంటిపై ఒక్క లావుపాటి స్వెట్టర్ వేసుకోవాలి. లేదంటే 2,3 పొరలుగా దుస్తులు ధరిస్తే వెచ్చదనం లోపలే లాక్ అయి ఉంటుంది.

డయాబెటిస్, బీపీ మెడిసిన్ వాడేవారు వాటికి ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకూడదు. ఒకవేళ ముఖం కొద్దిగా వంకరపోయినా, మాట నమిలినట్లు వచ్చి తడబడినా, చేతులు కాళ్లు లాగినట్లు అనిపించినా సరే.. కాసేపట్లో తగ్గుతుందని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి. సరైన సమయంలో రియాక్ట్ అయితే పక్షవాతం నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చు.

Stubbornness : ఎన్నిసార్లు చెప్పినా కొందరు ఎందుకు మారరు? వారి మైండ్‌లో జరిగే సైకాలజీ ఏంటి?

↑
Exit mobile version