Virat Kohli: కింగ్ కోహ్లీ ఊచకోత.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డులను తుడిచేసిన వన్డే బాద్షా

Virat Kohli: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఆక్లాండ్ పిచ్‌పై రన్ మెషిన్ చరిత్ర సృష్టించాడు.

Virat Kohli

క్రికెట్ పిచ్ మీద విరాట్ కోహ్లీ బ్యాట్‌తో దిగాడంటే చాలు, పాత రికార్డులన్నీ కరిగిపోవాల్సిందే. సరిగ్గా ఇప్పుడు ఇదే సీన్ ఆక్లాండ్ గడ్డపై రిపీట్ అయింది. కివీస్‌తో జరిగిన ఫస్ట్ వన్డేలో వరుణ దేవుడు కాస్త అడ్డుపడినా, మనోడు మాత్రం ఎప్పటిలాగే తన మార్క్ బ్యాటింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించేశాడు.

కేవలం 51 బాల్స్‌లోనే 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో చెలరేగిపోయి అరుదైన 74 రన్స్ బాదాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత్ ఈజీగా టార్గెట్ రీచ్ అవ్వడమే కాకుండా, విరాట్ కోహ్లీ (Virat Kohli)అకౌంట్‌లో మరో మైలురాయి చేరింది. కేవలం ఒక అర్థ శతకంతో ఆగిపోయే మ్యాటర్ కాదు, క్రికెట్ వరల్డ్‌ను షేక్ చేస్తున్న అసలు రికార్డుల జాతరను స్టార్ట్ అయేలా చేశాడు. .

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.. ఈ నాలుగు టఫ్ కండీషన్స్ ఉన్న దేశాలను క్రికెట్ వరల్డ్‌లో ‘సేనా’ (SENA) దేశాలుగా పిలుస్తారు. ఈ పిచ్‌లపై ఆడటమంటే ఎలాంటివారికైనా చెమటలు పట్టాల్సిందే. కానీ కోహ్లీ మాత్రం అక్కడ కూడా ఈజీగా తన డామినేషన్ చూపించాడు.

ఇప్పటివరకు ఈ కఠినమైన దేశాల్లో ఎక్కువ సార్లు 50కి పైగా రన్స్ చేసిన ఘనత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరుతో ఉంది. . సచిన్ 320 మ్యాచ్‌ల్లో 133 సార్లు ఈ ఫీట్‌ను సాధిస్తే, విరాట్ సేమ్ 320 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 134 సార్లు ఈ మార్క్ టచ్ చేసి మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బ్రేక్ చేశాడు. దీనిలో కోహ్లీ బాదిన 89 హాఫ్ సెంచరీలు, 45 శతకాలు కింగ్ స్టెబిలిటీకి అసలు సిసలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇక ఈ టాప్-10 లిస్ట్‌లో బ్రయాన్ లారా, సంగక్కర, జయవర్ధనే, రాహుల్ ద్రవిడ్ లాంటి లెజెండ్స్ ఉన్నా కూడా ఎవరికీ అందని దూరంలో కోహ్లీ నంబర్ వన్ పీఠాన్ని ఎక్కి కూర్చున్నాడు. అసలు మ్యాటర్ ఇక్కడితోనే ఆగలేదు. వన్డేల్లో టార్గెట్ ఛేజ్ చేసేటప్పుడు ప్రెజర్‌ను ఎలా తొక్కేయాలో కోహ్లీకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలీదని ప్రూవ్ చేశాడు.

Virat Kohli

ఇంతకాలం ఛేజింగ్‌లోనూ సచిన్ పేరుతో ఉన్న రికార్డును కోహ్లీ చాలా స్టైలిష్‌గా బ్రేక్ చేశాడు. వన్డే ఛేజింగ్‌లో సచిన్ చేసిన 8,720 రన్స్ రికార్డును వెనక్కి నెట్టి, 8,741 పరుగులతో కింగ్ కోహ్లీ టాప్‌లోకి దూసుకెళ్లాడు. అది కూడా ఏకంగా 66 పైచిలుకు యావరేజ్, 95 స్ట్రైక్ రేట్‌తో ఈ రికార్డును క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

అంతేకాదు, వన్డేల్లో తన మోస్ట్ ఫేవరెట్ అయిన మూడో నెంబర్ పొజిషన్‌లో బ్యాటింగ్‌కు దిగి ఏకంగా 13 వేల రన్స్ పూర్తి చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా విరాట్ కొహ్లీ (Virat Kohli) హిస్టరీ క్రియేట్ చేశాడు. కివీస్‌పై అత్యధిక పరుగులు చేసిన రికార్డులో రికీ పాంటింగ్‌తో ఈక్వెల్‌గా నిలిచి అదరగొట్టాడు. టెస్టులు, టీ20లకు ఆల్రెడీ గుడ్‌బై చెప్పిన కోహ్లీ.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం తన శకం ఇంకా క్లోజ్ అవలేదని, రికార్డుల వేటలో తాను ఎప్పటికీ ‘కింగ్’ నేనని మరోసారి ప్రూవ్ చేసి చూపించాడు.

Stubbornness : ఎన్నిసార్లు చెప్పినా కొందరు ఎందుకు మారరు? వారి మైండ్‌లో జరిగే సైకాలజీ ఏంటి?

↑
Exit mobile version