America – Iran
పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధం వలన ఏర్పడిన ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు సరిహద్దు దేశాలైన జోర్డాన్, కువైట్, బహ్రెయిన్‌కు కూడా విస్తరించాయి. విస్తరిస్తున్న ఈ వివాదాన్ని కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తాజాగా పిలుపునిచ్చారు.
శాంతి చర్చల కోసం ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ టెహ్రాన్‌లో పర్యటించినా కూడా, పరిస్థితులు చల్లారడం లేదు. ఈ దాడుల వల్ల ఇప్పటికే కొంతమంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో అంతర్జాతీయంగా ఆందోళన పెరుగుతోంది.
ఈ సంక్షోభంలో సముద్ర రవాణా మార్గాల కంట్రోల్ అన్నదే ప్రధాన వివాదాస్పద అంశంగా మారింది. ప్రపంచ చమురు ట్రాన్స్‌పోర్ట్‌లో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ఆ ప్రాంతీయ జలాల్లో పౌర ఓడలకు రక్షణ కల్పించడానికి, షిప్పింగ్ సేవలను పునరుద్ధరించడానికి అమెరికా సెంట్రల్ కమాండ్ తన దాడులను మరింత ఉధృతం చేసింది.
అమెరికా సైన్యం వరుసగా 13వ రాత్రి కూడా ఇరాన్ లక్ష్యాలపై వైమానిక దాడులను నిర్వహించింది. మరోవైపు యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు గల హౌతీ రెబెల్స్.. మరో మెయిన్ ట్రేడ్ రూట్ అయిన బాబ్ ఎల్-మండేబ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలను బెదిరింపులకు గురి చేస్తున్నారు.
ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న 2 సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై తాము అటాక్ చేసినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఎన్సెలియా, లైలా అనే 2 సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడి చేయడంతో.. ఆ నౌకల్లో మంటలు చెలరేగాయి. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అంతర్జాతీయంగా.. మొత్తం వాణిజ్యంలో 12 శాతం నడిచే ఈ ప్రాంతంలో ఇలా అటాక్స్ జరగడం వల్ల గ్లోబల్ ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్ దెబ్బతినే ప్రమాదం ఉందని లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ చెబుతోంది.
ఇటు అమెరికా, ఇరాన్(America – Iran) మధ్య మాటల యుద్ధం కూడా హద్దులు దాటింది. తమపై జరుగుతున్న దాడులకు కంటికి కన్ను అనేలా బదులిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వార్నింగ్ ఇవ్వగా.. తాము కంటికి తల తీసే విధానంలో సమాధానం ఇస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఘాటుగా స్పందించారు.
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హౌతీలు దాడులు కొనసాగిస్తే మరింతగా సైనిక చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. హౌతీల చర్యలకు ఇరాన్‌నే బాధ్యులను చేస్తామని చెప్పిన ట్రంప్.. దెబ్బతిన్న నౌకలకు పరిహారంగా తమ వద్దనున్న ఇరాన్ సీజ్డ్ నిధులనే ఉపయోగిస్తామని చెప్పారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కీలకమైన ఈ మార్గాల్లో ఘర్షణలు నిరంతరాయంగా కొనసాగుతుండటంతో ప్రపంచ ఇంధన మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. సముద్ర దిగ్బంధనాలు, వరుస దాడుల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 6 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు సుమారు 100 అమెరికన్ డాలర్లకు చేరుకుంది.
ఈ దాడులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఇంధన కొరత ఏర్పడి, అన్ని దేశాలలో కూడా ఎకనమిక్ సెక్టార్‌కు పెద్ద గండం పొంచి ఉందనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
Date Of Birth : జూలై 24న ఎవరికి అదృష్టం? ఈ నెంబర్ వారు అనవసర వాదనలకు దూరంగా ఉండాల్సిందే..
