The Paradise
సిల్వర్ స్క్రీన్‌పై నానీ మాస్ సునామీ రావడానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. గతేడాది నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. సేమ్ కాంబోలో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్(The Paradise) రాబోతుంది.
ఇప్పటికే ఈ మూవీపై టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ, నాని ఫ్యాన్స్‌లోనూ అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన అభిమానులంతా మైండ్ బ్లాక్ అయ్యేలా మేకర్స్ ఒక హాట్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ భారీ మూవీకి సంబంధించిన షూటింగ్‌ను టీమ్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసేసింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ రాకెట్ స్పీడ్‌తో సాగుతున్నాయి.
ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సెప్టెంబర్ 10న నేచురల్ స్టార్ నానికి సంబంధించిన ఒక కొత్త పిక్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి.. ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. శ్రీకాంత్ ఓదెల తన మొబైల్ నుంచి తీసిన డైరెక్ట్ స్క్రీన్‌షాట్‌ను ఈ పోస్టర్‌గా రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనిలో నాని లాంగ్ హెయిర్, ఫుల్ గడ్డంతో చాలా వైల్డ్ అండ్ రగ్డ్ పీరియడ్ లుక్‌లో కనిపిస్తున్నారు.
చేతిలో పెద్ద గన్ పట్టుకుని, జడను నోట్లో పెట్టుకుని.. కళ్లలో ఇంటెన్స్ అండ్ సీరియస్ లుక్స్‌తో రచ్చ లేపుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అయితే మెయిన్ రిలీజ్ కంటే ఒక్క రోజు ముందు సెప్టెంబర్ 23న గ్రాండ్ ప్రీమియర్ షోలతో ఫ్యాన్స్ ముందుకు రావడానికి టీమ్ రెడీ అయిపోయింది.
అణచివేతకు గురైన పీడిత ప్రజలు నాని సపోర్టుతో తిరగబడే ఒక పవర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ లైన్ సాగనుందని టీజర్ క్లియర్‌గా చూపించేసింది. ఇకపై ఈ నేల ఎవరిది.. అసహ్యించుకున్న నలుపే మా జెండా.. కాకి మా చిహ్నం అంటూ కొన్ని మాస్ డైలాగ్స్‌తో పాటు రక్తపాతంతో కూడిన గూస్ బంప్స్ యాక్షన్ సీన్స్ సినిమా రా అండ్ రస్టిక్‌గా ఉండబోతోందనేది ముందే చెప్పేసాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సీనియర్ నటుడు మోహన్ బాబు విలన్ రోల్‌లో కనిపిస్తున్నారు.
నిజానికి ఈ మాస్ యాక్షన్ డ్రామా ప్యారడైజ్‌ను మార్చి 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కొన్ని కారణాల వల్ల ఆగస్టు 21కి షిఫ్ట్ చేశారు. కానీ మళ్లీ డేట్ మారుతూ వచ్చిన ఈ మూవీ ఫైనల్‌గా సెప్టెంబర్ 24న థియేటర్లలో దండయాత్ర చేయడానికి రెడీ అయింది.
AQP4 Gene : రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా?..నైట్ టైమ్‌లో బ్రెయిన్‌లో జరిగే ‘జీన్’ కథ తెలుసుకోండి..
