APEC SUMMIT : ప్రపంచ రాజకీయాల్లో అపూర్వ ఘటన.. ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ట్రంప్,పుతిన్,జిన్‌పింగ్ భేటీ..

APEC SUMMIT : చైనాలోని షెన్‌జెన్‌లో జరుగుతున్న ఎపెక్ (APEC) సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చారిత్రక త్రైపాక్షిక సమావేశంలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకట్టుకుంది.

APEC SUMMIT

ప్రపంచ రాజకీయ యవనికపై ఊహించని చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న సమయంలో, ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్‌ అయిన మూడు అణ్వస్త్ర దేశాల అధినేతలు ఒకే వేదికపైకి వచ్చి చేతులు కలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తొలిసారిగా ఒకే చోట భేటీ అయి త్రైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

చైనాలోని టెక్ హబ్ షెన్‌జెన్ సిటీ వేదికగా జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఎపెక్) సదస్సు(APEC SUMMIT) సందర్బంగా నవంబర్ 19వ తేదీ ఈ సంచలన సమావేశం జరిగింది. ప్రపంచ అగ్రరాజ్యాల మూలస్తంభాల వంటి ఈ ముగ్గురు నేతలు ఇలా ముఖాముఖి కూర్చోవడం ప్రపంచ దౌత్య చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి ముందు షెన్‌జెన్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పూర్తి స్థాయి సైనిక వందనంతో గ్రాండ్‌గా స్వాగతం పలికారు. తర్వాత నిర్వహించిన గ్రాండ్ ఎపెక్ డిన్నర్‌లో ఈ ముగ్గురు ప్రపంచ నాయకులు కలిసి ఒకే గ్రూప్ ఫొటోలో మెరిశారు. ఈ వేడుకలో ట్రంప్, పుతిన్‌లు పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ పలకరించుకోవడం గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2025లో అలస్కా సమ్మిట్ తర్వాత వీరు డైరెక్టుగా కలవడం ఇదే మొదటిసారి కాగా, చాలా ఏళ్ల విరామం తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ ఎపెక్(APEC SUMMIT) లీడర్స్ గ్రూప్ ఫోటోలో కనిపించడం గ్లోబల్ వైడ్ ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈ హైప్రొఫైల్ త్రైపాక్షిక భేటీ వెనుకున్న ప్రధాన ఎజెండా అణ్వాయుధాల కోత అని వైట్ హౌస్ వెల్లడించింది. వరల్డ్‌లో నిమిషాల వ్యవధిలో నాశనం చేయగల అణ్వాయుధాల పరిమితిపై చర్చలు స్టార్ట్ చేయడమే ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశమని, అయితే ఫస్ట్ భేటీలోనే తక్షణ ఒప్పందాలు వచ్చేస్తాయని ఆశించడం లేదని చెప్పింది.

అలాగే దీంతో పాటు మిడిల్ ఈస్ట్‌లో గుబులు పుట్టిస్తున్న ఇరాన్ వ్యవహారం కూడా చర్చలకు వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ రష్యా,ఉక్రెయిన్ యుద్ధం గురించి మాత్రం ఈ భేటీలో చర్చించే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అమెరికా,చైనా దేశాల మధ్య కొత్త టారిఫ్‌ల రచ్చ కాకుండా, గతంలో చేసుకున్న ట్రేడ్ డీల్స్ అమలుపైన ఇప్పుడు దృష్టి పెట్టనున్నారు.

ఈ త్రైపాక్షిక దౌత్యానికి ముందుగానే ఎ పెక్ వేదికగా జిన్‌పింగ్, పుతిన్‌ తమ ప్రసంగాలతో గ్లోబల్ వేదికలకు గట్టిగా సంకేతాలిచ్చారు. ప్రపంచం ఎంత మారినా స్వేచ్ఛా వాణిజ్యానికే చైనా కట్టుబడి ఉంటుందని జిన్‌పింగ్ చెప్పగా.. పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు రష్యాను ఏమాత్రం భయపెట్టలేవని, బెదిరించలేవని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ 2 అగ్ర దేశాల వైఖరులు ఇలా ఉండగానే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారితో కలవడం, భవిష్యత్ ప్రపంచ పొలిటికల్ సీన్‌ను ఏ దిశగా తిప్పుతుందోనని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది.

Text Message Fights : గొడవలొస్తే వాట్సాప్‌లో పారాగ్రాఫ్‌లు రాస్తున్నారా? ఆ తప్పుతోనే బంధాలు తెగిపోతాయి జాగ్రత్త..

↑
Exit mobile version