BJP : ఏపీకి ట్రిపుల్ ఆఫర్ తెలంగాణకు ఊహించని షాక్..బీజేపీ కొత్త జాతీయ టీమ్ ఇదే..

BJP : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు ఏకంగా ముగ్గురు కీలక నేతలతో నేషనల్ స్థాయిలో పెద్దపీట వేసిన కమలదళం.. మరోవైపు తెలంగాణ నుంచి ఒక్క నేతకు కూడా నేషనల్ టీమ్‌లో చోటు ఇవ్వకపోవడం హాట్ టాపిక్ అయింది.

BJP

బీజేపీ జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తన న్యూ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించడంతో.. తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఊహించని చర్చ మొదలైంది.

ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు ఏకంగా ముగ్గురు కీలక నేతలతో నేషనల్ స్థాయిలో పెద్దపీట వేసిన కమలదళం, మరోవైపు తెలంగాణ నుంచి ఒక్క నేతకు కూడా నేషనల్ టీమ్‌లో చోటు ఇవ్వకపోవడం హాట్ టాపిక్ అయింది. గతంలో నేషనల్ రేంజ్‌లో హవా నడిపిన తెలంగాణ నేతలను ఈసారి పూర్తిగా పక్కన పెట్టడం వెనుక బీజేపీ(BJP) అధిష్ఠానం లెక్కలేంటన్న చర్చ నడుస్తోంది.

ఈ నయా కార్యవర్గంలో ఏపీకి చాలా ఇంపార్టెన్స్ దక్కింది. ఏపీ బీజేపీ(BJP) మాజీ అధ్యక్షురాలు డి. పురందేశ్వరి, సీనియర్ నేత రామ్ మాధవ్‌కు జాతీయ ఉపాధ్యక్ష పదవులు లభించాయి. వీరిద్దరితో పాటు విష్ణువర్ధన్ రెడ్డికి జాయింట్ కో-ఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలను అప్పగించారు.

అయితే, తెలంగాణ విషయానికి వస్తే మాత్రం పొలిటికల్ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గతంలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా పని చేసిన డి.కె. అరుణతో పాటు ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా సేవలందించిన కె. లక్ష్మణ్ ఇద్దరికీ ఈ కొత్త టీమ్‌లో చోటు దక్కలేదు.

తెలంగాణలో పార్టీని మరింత విస్తరించడమే నెక్స్ట్ టార్గెట్ అని చెబుతున్న సమయంలో , జాతీయ పదవుల్లో తెలంగాణ ప్రాతినిధ్యం సున్నా కావడం వెనుక బీజేపీ అధిష్ఠానం ఒక పక్కా స్ట్రాటజీతో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ లీడర్స్‌ను జాతీయ బాధ్యతలకు పరిమితం చేయకుండా, లోకల్‌ రాజకీయాల్లోనే ఫుల్ టైమ్ పనిచేయించి రాబోయే ఎన్నికల సమయానికి కమలం పార్టీని మరింత కేడర్ లెవెల్లో బలంగా చేయాలనే ప్లాన్‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా చూస్తే పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నాయకులకు ఈ కమిటీలో ప్రత్యేకమైన ప్రయారిటీ లభించింది. మొత్తం 13 మంది జాతీయ ఉపాధ్యక్షుల్లో మహిళలకు భారీగా ప్రాతినిధ్యాన్ని కల్పించారు.

రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఒడిశాకు చెందిన బైజయంత్ పాండా, ఉత్తరప్రదేశ్ నేత రేఖా వర్మ, తారిఖ్ మన్సూర్ జాతీయ ఉపాధ్యక్షులుగా తమ పదవులను నిలబెట్టుకున్నారు. వీళ్లతో పాటు ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్, పంజాబ్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌తో పాటు కొంతమంది సీనియర్లు జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు.

ఈ కొత్త లిస్ట్‌లో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి… జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కడం పెద్ద హైలైట్‌గా నిలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత స్మృతి ఇరానీకి పార్టీలో లభించిన అతిపెద్ద సంస్థాగత కమ్‌బ్యాక్ పదవి ఇదే అని చెప్పొచ్చు.

ఇక వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లవ్ కుమార్ దేవ్‌తో పాటు కొంతమంది ప్రముఖులు ప్రధాన కార్యదర్శులుగా కంటిన్యూ కాబోతున్నారు. వసుంధర రాజే, స్మృతి ఇరానీ ఇద్దరూ కూడా మరోసారి జాతీయ స్థాయిలో పవర్ ఫుల్ పోస్టుల్లోకి రావడం విశేషంగా కనిపిస్తోంది.

BJP

పార్టీ ఆర్గనైజేషన్ పరంగా చూస్తే.. బి.ఎల్ సంతోష్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)గా తన పట్టును నిలుపుకున్నారు. కాగా ఆయనకు అసిస్ట్ చేస్తూ శివప్రకాష్, సౌదాన్ సింగ్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా (సంస్థాగత) బాధ్యతలను స్వీకరించబోతున్నారు.

కీలకమైన నేషనల్ ట్రెజరర్ పదవిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించగా, ఈశాన్య రాష్ట్రాల కో-ఆర్డినేటర్‌గా సంబిత్ పాత్రను నియమించారు. పార్టీ మీడియా వ్యవహారాలు, పబ్లిక్ రిలేషన్స్ బాధ్యతలను అనిల్ బలూని చూసుకోబోతున్నారు.

మొత్తంగా ఏపీకి త్రిబుల్ ఆఫర్ ఇచ్చిన కమలం పెద్దలు.. తెలంగాణకు మాత్రం ప్రాతినిధ్యం లేకుండా చేయడం ద్వారా దక్షిణాదిలో ఒక డిఫరెంట్ పొలిటికల్ గేమ్ షురూ చేసినట్లు తెలుస్తోంది.

Dimagi Naxal Party : మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చిందోచ్..గంటల్లోనే లక్షల్లో ఫాలోవర్స్..పేరేంటో తెలుసా ?

Exit mobile version