Nitish Kaushal
అమెరికాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఉన్న ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ఎట్టకేలకు పట్టుకుంది. భారత్‌లోని పంజాబ్ కేంద్రంగా పనిచేసే జగ్గూ భగవాన్‌పురియా గ్లోబల్ క్రైమ్ సిండికేట్‌లో కీలక సభ్యుడైన నితీశ్ కౌశల్(Nitish Kaushal)ను యూఎస్‌లోని వర్మెంట్‌లో ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేసారు.
ఆపరేషన్ హార్డ్ బాల్ నేమ్‌తో అంతర్జాతీయంగా సాగిన భారీ ఆపరేషన్‌లో భాగంగా.. నితీశ్ కౌశల్(Nitish Kaushal)అరెస్ట్ జరిగింది. నితీశ్‌ను తమ మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చిన కొన్ని రోజుల్లోనే ఎఫ్‌బీఐ అతడిని అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ ముఠాకు సంబంధించిన ఇతర పరారీలో ఉన్న నేరగాళ్ల వివరాల కోసం ప్రజలు ఇన్ఫర్మేషన్ అందించాలని ఎఫ్‌బీఐ సోషల్ మీడియా ద్వారా కోరింది.
జగ్గూ భగవాన్‌పురియా ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్ అనేది పంజాబ్‌లో పుట్టి,ఇప్పుడు అమెరికా, కెనడా, యూకే, ఐరోపా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విస్తరించిన ఒక భయంకరమైన వ్యవస్థీకృత నేర ముఠాగా పేరు బడింది. వరల్డ్ వైడ్‌గా ఈ గ్యాంగ్‌కు వెయ్యి మందికి పైగా అనుచరులు ఉండగా, ఒక్క అమెరికాలోనే సుమారు వంద మంది యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రాసిక్యూటర్లు గుర్తించారు.
హత్యలు, కిడ్నాప్‌లు, భారీగా మాదకద్రవ్యాల రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, హవాలా లేదా మనీ లాండరింగ్ , హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి ప్రమాదకరమైన కార్యకలాపాలకు ఈ ముఠా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ముఠా నెట్‌వర్క్‌ను కూల్చడానికి కాలిఫోర్నియా జిల్లా కోర్టు జూన్ 25న నితీశ్ కౌశల్‌పై వారెంట్ జారీ చేయడమే కాకుండా, కఠినమైన రికో చట్టం కింద కేసులు నమోదు చేసింది.
ఈ నేర సామ్రాజ్యంలో లాలా అనే నిక్‌నేమ్‌తో పిలవబడే నితీశ్ కౌశల్ అత్యంత హింసాత్మక బాధ్యతలను చూసుకునేవాడని ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా గ్యాంగ్ తరఫున దాడులు, కిడ్నాప్‌లు వంటి పెద్ద నేరాలు చేయడం ఇతని పని.
గతేడాది జూలై 10న జరిగిన ఓ కిడ్నాప్ కేసు గురించి ఉదాహరణగా చెప్పుకుంటే…. వీరి ముఠాకు చెందిన డ్రగ్స్ కంటైనర్‌ను దొంగిలించాడనే అనుమానంతో .. ఒక వ్యక్తిని కాలిఫోర్నియాలోని మాంటెకా అనే ప్లేస్‌కు రప్పించింది ఈ ముఠా. అక్కడ మరికొందరితో కలిసి అతడిని బంధించి తీవ్రంగా హింసించింది.
ఆ తర్వాత బాధితుడిని ఫ్రెస్నోలోని ఒక అపార్ట్‌మెంట్‌కు పంపించి, నష్టపరిహారంగా 50 వేల డాలర్లను ఈ ముఠా డిమాండ్ చేసింది. అయితే, ఆ తర్వాత ముఠా పెద్దల ఆదేశాలతో అతడిని విడిచిపెట్టింది.ఈ దారుణ కిడ్నాప్ కేసులో నితీశ్ ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు.
ఈ ముఠా ముఖ్యంగా డ్రగ్స్ బిజినెస్ ద్వారానే కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఎఫ్‌బీఐ తేల్చింది. దక్షిణ కాలిఫోర్నియాలో కొకైన్, మెథామ్‌ఫెటమైన్ వంటి కాస్ట్‌లీ డ్రగ్స్ సేకరించి, భారీ కంటైనర్ ట్రక్కుల ద్వారా అమెరికా తూర్పు తీరానికి, అలాగే కెనడా బోర్డర్స్ కూడా దాటించడం వీరి పని.
ఒక్కో ట్రిప్పులో వంద కిలోల వరకు డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంటారని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా, బాధితుల కుటుంబాలు భారత్‌లో ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని, ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ద్వారా వారిని కూడా బెదిరించి వసూళ్లకు పాల్పడేవారు.
పంజాబ్‌లోని కొంతమంది అవినీతి అధికారుల సాయంతో తమ ప్రత్యర్థులపై అక్రమ కేసులను పెట్టించి, అవి విత్‌డ్రా చేసుకునే అవకాశమిస్తూ భారీగా డబ్బులు లాగేవారు. పంజాబ్‌లోని యూత్‌కు విదేశీ అవకాశాలు, లగ్జరీ లైఫ్ ఆశచూపి తమ ముఠాలోకి గుంజుకునేవారు.
ప్రస్తుతం నితీశ్ కౌశల్(Nitish Kaushal)అరెస్ట్‌తో ఈ అంతర్జాతీయ బ్యాక్ బోన్ విరిగినట్లయిందని ఎఫ్‌బీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ అభియోగాలు ఇంకా కోర్టులో పూర్తిస్థాయిలో ప్రూవ్ కావాల్సి ఉంది. కోర్టులో విచారణ ముగిసేవరకు చట్టప్రకారం నిందితులను నిర్దోషులుగానే పరిగణిస్తారన్న విషయం తెలిసిందే.
Cold-Pressed Oil : వంటింట్లో మళ్లీ మొదలైన పాత తరం సంప్రదాయం..రిఫైన్డ్ ఆయిల్స్‌కు చెక్
